📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Children missing Vijayawada: విజయవాడలో ఇద్దరు పిల్లల అదృశ్యం

Author Icon By Siva Prasad
Updated: February 19, 2026 • 11:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Children missing Vijayawada: విజయవాడలోని భవానీపురంలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. మేరారామ్‌ (12), ఉమారామ్‌ (13) అనే ఇద్దరు పిల్లలు నిన్న సాయంత్రం ట్యూషన్‌కు వెళ్లే క్రమంలో అదృశ్యమయ్యారు. వారి తల్లి స్వయంగా వారిని ట్యూషన్ పాయింట్ వద్ద దింపినప్పటికీ, వారు లోపలికి వెళ్లకుండా వెనక్కి వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ హఠాత్ పరిణామంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Read Also: Vangalapudi Anitha: జగన్‌పై మంత్రి అనిత సెటైర్

ఆటోలో వెళ్లిపోయినట్లు గుర్తింపు

ప్రాథమిక సమాచారం ప్రకారం, పిల్లలిద్దరూ ట్యూషన్ సెంటర్‌కు వెళ్లకుండా బయట వేచి ఉన్న ఒక ఆటోలో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు మరియు సిసిటివి ఫుటేజీల ద్వారా సమాచారం అందుతోంది. అయితే వారు ఎక్కడికి వెళ్లారు? ఆ ఆటో ఎవరిది? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తమ పిల్లలు కనిపించడం లేదని తల్లిదండ్రులు వెంటనే భవానీపురం పోలీస్ స్టేషన్‌లో ఆశ్రయించారు.

Children missing Vijayawada: పోలీసుల దర్యాప్తు ప్రారంభం

బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భవానీపురం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. బాలురు ప్రయాణించిన ఆటో రూట్‌ను సిసిటివి కెమెరాల ద్వారా ట్రాక్ చేస్తున్నారు. చిన్నారుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Bhavanipuram Police Station Children Missing Vijayawada Meraram Umaram Missing Two Boys Missing in Auto vijayawada crime news Vijayawada Missing Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.