📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Vijayawada: దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ

Author Icon By Saritha
Updated: December 16, 2025 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంద్రకీలాద్రి : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి(Vijayawada) వార్ల దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగుతున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమాలు చివరి రోజు సోమవారం పూర్ణాహుతితో దిగ్విజయంగా ముగిశాయి. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలతో కృష్ణమ్మ ఒడిలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. దేవస్థానం స్థానాచార్యులు శివ ప్రసాద్, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్, ఇతర వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో పాత యాగశాలలో ఉప ప్రధాన అర్చకులు, ముఖ్య అర్చకులు పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. సీనా నాయక్ (స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్), ముఖ్య పండుగ అధికారి మూర్తి (ఈవో, ద్వారకా తిరుమల), ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు దుర్గమ్మ దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. పూర్ణాహుతి అనంతరం పండితులు, అర్చకులు భక్తులకు, అధికారులకు వేద ఆశీర్వచనం అందించారు.

Read also : Tirumala: ఈనెల 18న మార్చి నెల తిరుమల దర్శన కోటా విడుదల

Vijayawada Bezawada is resounding with chants of Durga Amma.

భవాని దీక్షల గణాంకాలు

11వ తేదీ నుండి భక్తుల సంఖ్య 5,15,000, లడ్డు ప్రసాదం పంపిణీ 21.20 లక్షలు, అన్నప్రసాదం స్వీకరించిన భక్తులు 2,03,645, కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులు 51,435 అని ఇఓ తెలిపారు.

పక్కా ప్రణాళికతోనే భవాని దీక్షలు విజయవంతం: కలెక్టర్

భవాని దీక్షలు 2025 అత్యంత సంతృప్తికరమైన వరణంలో, భక్తుల వాతా నుంచి విశేష స్పందనతో విజయవంతంగా ముగిశాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా(Vijayawada) తెలిపారు. సోమవారం ఇంద్రకీలాద్రిపై(Indrakeeladri) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, భక్తుల సౌక ర్యార్థం జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో చేసిన ఏర్పాట్లు సత్ఫలితాల నిచ్చాయనిచ్చాయన్నారు. అన్ని శాఖల సమన్వయంతో రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, మున్సిపల్ సహా ప్రతి శాఖాధికారులు, సిబ్బంది పండుగ విజయవంతానికి పగలు, రాత్రి అనకుండా కృషి చేశారని కొనియాడారు. భవాని భక్తుల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు మంగళవారం కూడా కొనసాగుతాయని, బుధవారం నుండి దేవస్థానం యథావిధిగా పనిచేస్తుందన్నారు. ప్రెస్మిట్ అనంతరం, కలెక్టర్, అధికారులు, దేవస్థానం పాలకమండలి చైర్మన్ అండ్ సభ్యులు క్యూలైన్లు, ఘాట్లను స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

Bhavani Deeksha Durga Devi Temple indrakeeladri Latest News in Telugu Religious Festival Telugu News Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.