విజయవాడ : రాష్ట్రంలోని సముద్ర తీరంలో విస్తృతంగా పోర్టులను(Vijayawada) అభివృద్ధి చేసే దిశలో ఏపీ ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది. ఈ పోర్టులను ప్రధాన జాతీయ రహదారులను అనుసంధానం చేసే దిశలో చర్యలు చేపట్టనున్నది. దీని వలన రవాణా వ్యవస్థ అత్యంత బలీయం చేయనున్నది. ఇప్పటికే కోస్తల్ ఏరియా ఉన్న జిల్లాల్లో మారిటైం ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ దిశగా పోర్టు సమీప ప్రాంతాల్లో (పోర్టు నుంచి 2 నుంచి 3 కి.మీ. వరకూ ఉన్న ప్రాక్సిమల్ జోన్లో) అవసరమైన మౌలిక సదుపాయాలను రూపుదిద్దేందుకు ప్రభుత్వం రూ. 1,220 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించింది. ఈ క్లస్టర్ల కోసం పోర్టులకు సమీపంలో సహజంగా ఉన్న ఉప్పు భూములను వినియోగించుకుని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఈ భూములను రాష్ట్రానికి కేటాయించాలని, కేంద్రంలోని అంతర్గత వాణిజ్యం, పరిశ్రమల ప్రోత్సాహక శాఖను కోరింది. దీనికి అనుగుణంగా ఏపీ మారిటైం బోర్డు రోడ్మ్యప్ను తయారు చేసింది. పోర్టు ఉన్న ప్రాంతాలకు సమీప గ్రామాలను అనుసంధానించి క్రమంగా నగరీకరణ చేయాలని నిర్ణయించింది. పోర్టుల నుంచి 2, 3కి.మీ. పరిధిలో రహదారులు, విద్యుత్ సదుపాయాలు, నీటి సరఫరా, ఇతర మోలిక వసతులు అభివృద్ధిచేయడానికి 11 ప్రతిపాదనలు రూపొందించి, ఇవి సాగరమాల 2.0 పథకం కింద కేంద్ర ఆమోదానికి పంపిస్తున్నారు. మూలపేట పోర్టు రసాయన పరిశ్రమలు, వాటి అనుబంధ యూనిట్లకు తగిన మౌలిక వసతులు కల్పించనున్నారు.
Read also: 8.54 లక్షల మె.ట ధాన్యం కొనుగోలు.. మొక్కజొన్న, పత్తి కొనుగోళ్లు కూడా వేగవంతం
పోర్టు సమీప ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి
విశాఖపట్నం(Visakhapatnam) పరిధిలో విశాఖ చుట్టుపక్కల ఫార్మా పరిశ్రమలు ఎక్కువగా ఉన్నందున, ఫార్మా, సముద్ర ఆధారిత వాణిజ్య పరిశ్రమలకు(Vijayawada) అనుకూలమైన క్లస్టర్ అభివృద్ధి చేయనున్నారు. రాంబిల్లి పరిధిలో నేవల్ కార్యకలాపాలకు ఉపయోగించనున్నారు. ఈ ప్రాంతంలో రక్షణరంగ పరిశ్రమల క్లస్టర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం. కాకినాడ పరిధిలో ఇక్కడ ఇప్పటికే చమురు వెలికితీసే పరిశ్రమలు ఉన్నాయి. దీనికి అనుసంధానంగా పెట్రోలియం, లూబ్రికెంట్ ఆధారిత పరిశ్రమల క్లస్టర్ అభివృద్ధి. మచిలీపట్నం పరిధిలో విజయవాడ సమీపంలో ఉండటంతో, హెవీ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ రంగానికి అనువైన పారిశ్రామిక మోలిక వసతులు. రామాయపట్నం పరిధిలో ఇక్కడ బీపీసీఎల్ ప్రధానంగా రూ. లక్ష కోట్లు వ్యయంతో చమురు శుద్ధి కర్మాగారం స్థాపించనుంది.
పరిశ్రమల క్లస్టర్లుగా మారబోతున్న పోర్టు పరిధులు
కృష్ణపట్నం: తిరుపతి సమీపంలో ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఉన్నాయి. రాయలసీమలో ఉన్న పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు అనుసంధానంగా పరిశ్రమ క్లస్టర్ అభివృద్ధి. దుగరాజపట్నం ఇక్కడ షిప్ బిల్డింగ్, ఓడల రిపేర్, నిర్వహణ, ఓవర్హోలింగ్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా క్లస్టర్ ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ప్రధాన ఓడరేవులు ఉన్నాయి. ఇవే కాకుండా రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ సెజ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. రక్షణ అవసరాల కోసం రాంబిల్లి వద్ద నావల్ ఆపరేషన్లకు అనుకూలంగా మరో పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. భవిష్యత్తులో నక్కపల్లి, దుగరాజపట్నం ప్రాంతాల్లో కూడా ఓడరేవుల ఏర్పాటు ప్రధాన లక్ష ్యంగా ఉంది. ఈ విధంగా ప్రతి 50 కి.మీ. దూరంలో పోర్టు, ఫిషింగ్ హార్బర్, సముద్ర ఆధారిత పారిశ్రామిక యూనిట్లు ఏర్పడే విధంగా ప్రణాళిక సిద్ధమవుతోంది. దీంతో వాణిజ్యం విసృతంగా పెరగడమే కాకుండా, తీర ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read also: