📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: Vijayawada : అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు నమోదు విధానం

Author Icon By Pooja
Updated: September 27, 2025 • 11:17 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమలుకు ప్రభుత్వం సంసిద్దమవు తుంది. ఇకపై అసెంబ్లీలో సభ్యుల హాజరు నమోదుకు సంతకాల విధానానికి స్వస్తి పలకనుంది. దీన్ని ప్రస్తుత సమావేశాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. సభ్యులు వారి స్థానాల్లో ఉన్నప్పుడే ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఆటోమేటిక్గా హాజరు నమోదుకానుంది. సభకు హాజరైన, గైర్హాజరైన సభ్యుల సమాచారం నిర్దిష్ట కాలవ్యవధిలో సీఎం డ్యాష్ బోర్డుకు(dashboard) చేరనుంది. అసెంబ్లీలో సభ్యుల హాజరు నమోదుకు సంతకాలు చేసే విధానానికి స్వస్తి పలికే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అసెంబ్లీలో ఆటోమేటిక్ హాజరు నమోదు వ్యవస్థ ఏర్పాటు బాధ్యతను హైదరాబాద్కు చెందిన డ్యురాంక్ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థకు అప్పగించింది. ప్రస్తుత సమావేశాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

Read Also: Godavari:మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, అధికార యంత్రాంగం అప్రమత్తం

ప్రస్తుతానికి నిర్దిష్ట సమయంలో సభలో సభ్యుల వీడియో రికార్డింగ్ తీసుకుని, దాన్ని డేటాలోని సభ్యుల ఫొటోలతో సరిపోల్చి జాబితా సిద్ధం చేస్తున్నారు. దీన్ని పూర్తిస్థాయిల్లో అమల్లోకి తెచ్చాక సభలో పాన్, టిల్ట్, జూమ్ కెమెరాను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి సభ్యుడి ముఖ లక్షణాల్ని డేటాలో నిక్షిప్తం చేస్తారు. ప్రతి సభ్యుడికి 175 వెక్టార్ పాయింట్స్ నమోదు చేస్తారు. పీటీజెడ్ కెమెరా 180 డిగ్రీల్లో తిరుగుతూ ప్రతి గంటకూ ఓ సారి సభ్యుల ఫొటోలు తీసి సర్వర్కి పంపిస్తుంది. అక్కడ ముందే నిక్షిప్తం చేసిన సభ్యుల వెక్టార్ ప్యాయింట్స్ ని, కెమెరా పంపిన ఫొటోలతో ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా సరిపోల్చి హాజరైన, హాజరు కాని సభ్యుల జాబితా రూపొందిస్తారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొందరు శాసనసభసమావేశాలకు(legislative sessions) హాజరుకాకుండానే రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోతున్నారు. ఆటోమేటిక్ విధానం అమల్లోకి వస్తే దీనికి అడ్డుకట్ట పడనుంది. శాసనసభ సమావేశాలకు కొందరు ఎమ్మెల్యేలు ఆలస్యంగా రావడం, కీలకమైన అంశాలపై చర్చ జరుగుతున్నప్పుడు గైర్హాజరవడం, సమావేశం ముగియడానికి చాలా ముందే వెళ్లిపోవడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల సీఎం మాట్లాడుతున్నప్పుడు సభలో సుమారు 50 మంది సభ్యులే ఉండటంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. సభ్యులంతా విధిగా సమావేశాలకు హాజరయ్యేలా చూడాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనే యుల్ని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో చీఫ్ విప్, విప్లు సభ్యులతో మాట్లాడి, సమయపాలన పాటించాలని గట్టిగా సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

AI Attendance Andhra Pradesh Assembly Artificial intelligence Digital Governance Google News in Telugu Latest News in Telugu Telugu News Today Vijayawada

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.