విజయవాడ (Vijayawada) రైల్వే స్టేషన్‌లో, కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో ఓ ప్రయాణికుడు ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నాడు. అక్కడే ఉన్న ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎం. నరసింహారావు వెంటనే స్పందించి, ఆ ప్రయాణికుడిని ప్లాట్‌ఫారమ్ పైకి లాగి ప్రాణాలు కాపాడారు. అనంతరం ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును నిలిపివేశారు. కానిస్టేబుల్ సమయస్ఫూర్తిని ప్రయాణికులు, అధికారులు అభినందిస్తున్నారు.
Read Also: Atchannaidu: రైతులకు త్వరలో విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తాం
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: