📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Jagan : జగన్ ఆరోపణలను ఖండించిన విజయసాయిరెడ్డి

Author Icon By Sudheer
Updated: May 27, 2025 • 7:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ అధినేత జగన్ (Jagan) చేసిన ఆరోపణలపై ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరలేదని, చంద్రబాబుకు అనుకూలంగా పని చేయలేదని స్పష్టం చేశారు. వైసీపీలోని ఓ వర్గం కావాలనే తనపై కుట్రలు పన్నుతోందని, సోషల్ మీడియాలో తనపై అబద్ధపు ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. “నాపై సోషల్ మీడియాలో అసత్య కథనాలు ప్రచారం చేశారు. నన్ను రెచ్చగొట్టి జగన్‌కి నష్టం కలిగించాలనే కుట్ర ఇది” అని అన్నారు.

వైఎస్ కుటుంబానికి సేవ చేసిన తనను పక్కన పెట్టడం బాధాకరం

విజయసాయిరెడ్డి (vijayasai reddy) మాట్లాడుతూ, తాను మూడు తరాలుగా వైఎస్ కుటుంబానికి సేవ చేసిన వ్యక్తినని గుర్తుచేశారు. అయినా కొందరి మాటలు నమ్మి జగన్ తనను పక్కన పెట్టారని వాపోయారు. తనను అవమానించే, కుట్రలు చేసే కోటరీకి ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. తన మౌనమే కొందరికి నచ్చడం లేదని, రాజకీయ అనుభవం లేని వారు పార్టీకి ముప్పుగా మారుతున్నారని వ్యాఖ్యానించారు. “జగన్‌ గారు నేరుగా అడిగితే బాధ్యత తీసుకునేవాడినేమో, కానీ ఈ విధంగా అర్ధంలేని ఆరోపణలు చేస్తే తట్టుకోలేను” అని తెలిపారు.

టీడీపీలో చేరే ప్రసక్తే లేదు

తాను టీడీపీలో చేరే ప్రశ్నే లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. “కలవాలంటే బహిరంగంగానే కలుస్తా, వెనక నుండి రాజకీయ చర్చల అవసరం లేదు” అని తేల్చిచెప్పారు. తాను ఆదిశేషగిరిరావు ఇంటికి వెళ్లిన మాట నిజమేనని చెప్పారు, కానీ అది వ్యక్తిగత సంబంధం కోసమేనని, రాజకీయ చర్చలేమీ జరగలేదని స్పష్టం చేశారు. అలాగే, లిక్కర్ స్కాం అన్నప్పుడు, తాను టీడీపీ నేతలతో చర్చించడం ఏమిటి అని ప్రశ్నించారు. “సిట్ విచారణలో నేను ఏ1 గురించి మాత్రమే వివరించాను. మిగతా వారు నా పరిధిలోకి రావడం లేదు” అంటూ ఆరోపణలను ఖండించారు.

Read Also : Formula-E Race Case : కేటీఆర్ కు ACB నోటీసులు

Google News in Telugu Jagan's allegations TDP vijayasai reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.