Vijayarama Raju: ప్రతిభ ఆధారంగానే క్రీడా కార్యదర్శుల నియామకం

Read Time:  1 min
Vijayarama Raju: ప్రతిభ ఆధారంగానే క్రీడా కార్యదర్శుల నియామకం
FONT SIZE
GET APP

విజయవాడ : జిల్లా స్థాయి క్రీడా కార్యదర్శులను ప్రతిభ ఆధారంగా నియమించేందుకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎంపికైన వారు రెండేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగుతారు. గతంలో కార్యదర్శి (Secretary) గా పనిచేసిన వారికి ఈ సారి అవకాశం ఇవ్వరు. కార్యదర్శులుగా ఎంపిక కావడానికి వంద మార్కులను పాయింట్లు ఇస్తారు. సర్వీసు (service) కు ఏడాదికి ఒక పాయింటు చొప్పున గరిష్టంగా 25 పాయింట్లు ఇస్తారు. అర్హతలకు ఐదు, అదనపు అర్హతలకు ఐదు, వ్యక్తిగతంగా క్రీడల్లో సాధించిన పతకాలకు 20, గతంలో క్రీడల నిర్వహణలో చూపిన నైపుణ్యాలకు ఐదు.

Vijayarama Raju: ప్రతిభ ఆధారంగానే క్రీడా కార్యదర్శుల నియామకం
Vijayarama Raju: ప్రతిభ ఆధారంగానే క్రీడా కార్యదర్శుల నియామకం

నిబద్ధతకు

విద్యార్థులు సాధించిన విజయాలపరంగా 30, పాఠశాల అభివృద్ధికి చేసిన కృషికి ఐదు, పాఠశాల విధుల్లో చూపిన నిబద్ధతకు ఐదు పాయింట్ల చొప్పున కేటాయిస్తారు. మహిళా టీచర్ల (Women teachers) కు ప్రోత్సాహకంగా అదనంగా 10 పాయింట్లు ఇస్తారు. ఈ పాయింట్లలో ఎక్కువ సాధించిన వారిని జిల్లా స్థాయి క్రీడా కార్యధర్శులుగా నియమించాలని జిల్లా విద్యాదికారులను డైరెక్టర్ విజయరామరాజు (Vijayarama Raju) ఆదేశించారు. ఎంపికైన వారి జాబితాను ఆగస్టు 8 లోపు డైరెక్టరేట్కు సమర్పించాలని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత సంపన్న నగరం ఏది?

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం (Visakhapatnam) ను సాధారణంగా అత్యంత సంపన్న నగరంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఆర్థిక ఉత్పత్తి, పారిశ్రామిక అభివృద్ధి పరంగా ఇది ఇతర నగరాల కంటే ముందుంది.

ఆంధ్రప్రదేశ్‌ పాత పేరు ఏమిటి?

ఆంధ్రప్రదేశ్‌ పాత పేరు ఆంధ్ర రాష్ట్రం (Andhra State).1953లో మద్రాస్ రాష్ట్రం (Madras State) నుండి తెలుగు మాట్లాడే ప్రాంతాలను వేరుచేసిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: National Sports Bill 2025: లోక్‌సభలో జాతీయ క్రీడా బిల్లు ప్రవేశం..

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.