Telugu News: Vijayanagaram:కాకి తీసిన దీపంతో అగ్నిప్రమాదం:నాలుగు ఇళ్లు బూడిద

Read Time:  1 min
Vijayanagaram
Vijayanagaram
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం(Vijayanagaram) జిల్లాలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గరివిడి మండలం కోనూరు గ్రామంలో జరిగిన ఈ ఘటనలో నాలుగు తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం ఓ కాకి చర్యేనని గ్రామస్తులు చెబుతున్నారు. కార్తిక మాసం సందర్భంగా ఒక కుటుంబం ఇంటి డాబాపై దీపాలు వెలిగించగా, వాటిలో ఒకటి ఓ కాకి ఎత్తుకొని సమీపంలోని మరో ఇంటి పైకప్పుపై వదిలింది. పైకప్పు తాటాకులతో ఉండటంతో నిప్పు వేగంగా వ్యాపించి భారీ మంటలు చెలరేగాయి. గ్రామస్తులు వెంటనే మంటలు అదుపు చేయడానికి ప్రయత్నించినా, మంటలు వేగంగా పరిసర ఇండ్లకు వ్యాపించాయి.

Read Also: Jammu & Kashmir blast: ఘోరం.. పేలుడు దాటికి ఎగిరిపడ్డ మృతదేహాలు

Vijayanagaram
Vijayanagaram

సమాచారం అందుకున్న అగ్నిమాపక(Vijayanagaram) సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని ఫైరింజన్ల(Fire engines) సహాయంతో మంటలను నియంత్రించారు. అయితే అప్పటికే నాలుగు తాటాకు ఇళ్లు కాలిపోయాయి. వీటిలో ఒకటి కౌలు రైతు నంబూరి గోపికి చెందినది. ఇటీవల పెట్టుబడుల కోసం ఆయన రూ.1 లక్ష అప్పు తెచ్చుకున్నట్లు, ఆ మొత్తం నగదుతో పాటు ఇంట్లో ఉన్న అరతులం బంగారం కూడా మంటల్లో బూడిదైపోయిందని ఆయన బాధ వ్యక్తం చేశారు. తహసీల్దారు సీహెచ్. బంగార్రాజు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మొత్తం సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేయగా, బాధితులకు ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.