📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Vijaya Sai Reddy: లిక్కర్‌ కేసులో విజయసాయిరెడ్డికి నోటీసులు..

Author Icon By Anusha
Updated: July 11, 2025 • 1:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్న లిక్కర్ స్కాంలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో కీలక వ్యక్తిగా పేరు చెబుతున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి సిట్‌ (Special Investigation Team) నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ పెద్ద చర్చ మొదలైంది.ఏప్రిల్ 18న విజయసాయిరెడ్డి (Vijaya Sai Reddy) ఇప్పటికే ఒకసారి సిట్ ఎదుట హాజరయ్యారు.గత విచారణ టైమ్‌లో విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అంటూ ఆనాడు ఆయన ఆరోపించారు. తన సమక్షంలోనే మూడుసార్లు మద్యం పాలసీపై సిట్టింగులు జరిగాయని, కానీ, ఈ పాలసీతో తనకు సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. సూత్రధారులు, పాత్రధారులు, బిగ్‌ బాస్‌ అంటూ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.ఇప్పుడు, రెండోసారి సిట్‌ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.

లిక్కర్‌ కేసు

అయితే, ఈసారి ఎలాంటి కీలక విషయాలు బయటపెడతారోనన్న ఉత్కంఠ నెలకొంది.ఏపీ మద్యం కేసులో సిట్‌ అధికారులు దర్యాప్తు వేగవంతం చేసే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్‌ చేశారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (Chevireddy Bhaskar Reddy) ఇద్దరు అనుచరులను ఇటీవల సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. లిక్కర్‌ కేసులో A35, A36గా ఉన్న బాలాజీ కుమార్‌యాదవ్, యద్దాల నవీన్ అనే ఇద్దరు వ్యక్తులను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్‌ కేసు నమోదు తర్వాత ఇద్దరు పరారీలో ఉండడంతో సెల్‌ఫోన్‌ లిగ్నల్స్‌ ఆధారంగా పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఇండోర్ నుంచి విజయవాడకు తరలించారు. లిక్కర్ అక్రమాల డబ్బు తరలింపులో ఇద్దరి పాత్ర ఉన్నట్లు సిట్‌ అధికారులు భావిస్తున్నారు. దాంతో, లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ల సంఖ్య 11కు చేరింది.

Vijaya Sai Reddy: లిక్కర్‌ కేసులో విజయసాయిరెడ్డికి నోటీసులు..

లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని

అదేసమయంలో ఎన్నికల టైమ్‌లో తెలంగాణ నుంచి ఏపీకి భారీగా డబ్బులు తరలించారని బాలాజీకుమార్‌పై ఆరోపణలు ఉన్నాయి.మరోవైపు, ఇదే కేసులో A39గా ఉన్న చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి ACB కోర్టులో చుక్కెదురు అయింది. మోహిత్‌రెడ్డి ముందస్తు, మధ్యంతర బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్ చేసింది. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని మోహిత్‌రెడ్డికి ఇప్పటికే సిట్ నోటీసులు చేసింది. ఈ క్రమంలోనే, ఏసీబీ కోర్టు (ACB Court) ను ఆశ్రయించగా, బెయిల్‌ పిటిషన్లను తిరష్కరించింది. ఇక, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అరెస్ట్ తర్వాత మోహిత్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. మొత్తంగా, ఒకవైపు దర్యాప్తు వేగవంతం, అరెస్ట్‌లు, మరోవైపు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించడం, మోహిత్‌రెడ్డి బెయిల్ పిటిషన్లు తిరస్కరించడం.తాజాగా విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు పంపించడం ఇంట్రస్టింగ్‌గా మారుతోంది.

విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?

విజయసాయిరెడ్డి నిజానికి ప్రొఫెషన్ చార్టెడ్ అకౌంటెంట్. ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి దగ్గరగా ఉండటం వల్ల రాజకీయంగా జగన్‌ మోహన్ రెడ్డికి మద్దతుగా పనిచేశారు. రాజకీయాల్లో జగన్ నాయకత్వాన్ని బలపరిచేలా కీలక పాత్ర పోషించారు.

విజయసాయిరెడ్డి కుటుంబం గురించి ఏమైనా సమాచారం ఉందా?

ఆయన వ్యక్తిగత జీవితం గురించి పబ్లిక్‌గా పెద్దగా సమాచారం లేదు. కుటుంబాన్ని మీడియా వెలుపల ఉంచే ప్రయత్నం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: TTD: తిరుమల లో15,16 రెండు రోజులు విఐపి బ్రేక్ రద్దు

AP liquor case AP liquor scam ap politics latest Breaking News liquor policy scam andhra SIT notices Telugu News vijayasai reddy liquor case vijayasai reddy news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.