📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vijaya Name Misuse: విజయ బ్రాండ్ ను దెబ్బతీస్తున్న ఎపి.. గుత్తా ఆమిత్ రెడ్డి

Author Icon By Saritha
Updated: March 10, 2026 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vijaya Name Misuse: విజయ బ్రాండ్ ను ఎపి ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఆ డెయిరి తెలంగాణ ఛైర్మన్ గుత్తా ఆమిత్ రెడ్డి మండి పడ్డారు. ఏపి ఫెడరేషన్ ఫ్రాంచైజ్ పంపిణీచేస్తోన్న నెయ్యి వెజిటెబుల్ ఆయిల్ అని స్పష్టం చేశారు. ఏపి ఫెడరేషన్ తెస్తున్న నెయ్యిని ఎన్ఐబికి తాము టెస్టు చేయించామని, కల్తీ జరిగినట్టు రిపోర్టులో వచ్చిందని సంచనల అంశాలను బయటపెట్టారు. ఈ అంశంపై ఏపి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర పునర్విభజన అనంతరం తెలంగాణ విజయ డెయిరి పూర్తిగా సహకార రంగంలో పనిచేస్తూ రైతుల నుండి పాలను సేకరించి నెయ్యితోపాటు నాణ్యమైన పాల ఉత్పత్తులను రాష్ట్ర ప్రజలకు విక్రయిస్తోందన్నారు. అయితే ఏపి ఫెడరేషన్ మాత్రం పేరుకే విజయ డెయిరి బ్రాండ్కింద ఉందని, మ్యాక్స్ చట్టం కింద అక్కడి డెయిరి జిల్లా ఫెడరేషన్లుగా విడిపోయిందన్నారు. అలా ఏపిలో విజయ బ్రాండ్తో వ్యాపారం చేసుకు నేందుకు కొంతమంది ప్రయివేటు వ్యక్తులకు, వ్యాపార సంస్థలకు అనుమతి ఇచ్చిందన్నారు.

Read Also: AP TG education issue : తెలుగు వర్సిటీల వివాదం, ఏపీ వీసీకి తెలంగాణ నోటీసు

Vijaya Name Misuse: AP is damaging the Vijaya brand.. Gutta Amit Reddy

ఫలితంగా ఈ మధ్యకాలంలో మేఘనాఫుడ్స్ సంస్థతోపాటు మేఘనాథ్ రెడ్డి అనే వ్యక్తి విజయ ఫుడ్స్ పేరుతో ఏపి నుంచి ఫ్రాంచైజ్ అనుమతి పొంది తెలంగాణలో విక్రయాలు కొనసాగిస్తు న్నారని వివరించారు. వారికి రాష్ట్రానికి సంబంధించిన రైతులతో సంబంధం లేదని, పాల సేకరణ చేయడం లేదని, గుజరాత్లోని ఓ ఫ్యాక్టరీలో తయారు చేసిన నకిలీ నెయ్యిని తెలంగాణలో విజయ బ్రాండ్ పేరుతో ప్రతి నెలా 100 టన్నుల మేర అమ్ముతున్నారని ఆరోపించారు.

ప్రజల ఆరోగ్యానికి ముప్పు

కల్తీపాలు, నెయ్యి తో (Ghee) ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ఎపి డెయిరి పాలప్యాకెట్ మీద వివరాలను స్కాన్ చేస్తే ప్రైవేట్ కంపెనీ డిటెయిల్స్ వస్తున్నాయన్నారు. డెయిరి ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు/సంస్థలు విజయ డెయిరి పేరు వాడుకోవడానికి వీలులేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై ఎన్నోసార్లు ఏపీ డెయిరికి లేఖలు రాసినా స్పందన లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర డెయిరి రైతులకు నష్టం జరిగితే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు విజయ బ్రాండ్ పేరును చూసి కొనుగోలు చేయాలన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Adulterated Ghee Gutta Amit Reddy Latest News in Telugu Telangana Vijaya Dairy Telugu News Vijaya Dairy Vijaya Name Misuse

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.