📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్ రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు పాఠశాలలో అశ్లీల నృత్యాలు.. మంత్రి లోకేశ్ సీరియస్

YSRCP Leaders: పిన్నెల్లి సోదరులను పరామర్శించిన వైసీపీ నేతలు

Author Icon By Siva Prasad
Updated: February 9, 2026 • 10:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

YSRCP Leaders: నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను వైసీపీ ముఖ్య నేతలు సోమవారం పరామర్శించారు. మాజీ మంత్రి విడదల రజని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ములాఖత్ ద్వారా వారిని కలిసి ధైర్యం చెప్పారు.

Read Also: Ghee Controversy : కల్తీ జరిగింది మీ హయాంలో కాదా ? – విడదల రజనీ

అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు

జైలు వెలుపల నేతలు మాట్లాడుతూ.. పిన్నెల్లి సోదరులు ఎంతో ధైర్యంగా ఉన్నారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షతో ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, వైసీపీ నాయకులు ఎవరూ భయపడే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం వైఖరిని ప్రజలందరూ గమనిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని విమర్శించారు.

YSRCP Leaders: Vidadala Rajani met the Pinnelli brothers in Nellore jail.

YSRCP Leaders: అధికారులకు, నేతలకు శిక్ష తప్పదు

నేడు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న నాయకులకు, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులకు భవిష్యత్తులో చట్టపరమైన శిక్షలు తప్పవని నేతలు హెచ్చరించారు. “రేపటి రోజున మా ప్రభుత్వం వస్తుంది.. అప్పుడు ఈ దుర్మార్గపు పాలనకు బాధ్యులైన వారు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది” అని వారు వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అక్రమ కేసులు

ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో ఇళ్లపై విధ్వంసం, అక్రమ కేసులు తప్ప అభివృద్ధి లేదని విడదల రజని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుర్మార్గపు పాలనను ఎప్పుడూ చూడలేదని, ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసుల వల్ల వందలాది మంది నేతలు నిత్యం జైళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్ మళ్లీ సీఎం అయ్యే వరకు పోరాటం

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమకు ఒకటే దిశానిర్దేశం చేశారని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని సూచించారని నేతలు తెలిపారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు అక్రమ కేసులకు వెరవకుండా పోరాడుతూనే ఉంటారని వారు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP Politics Jagan Mohan Reddy Kakani Pujitha MLC Parvathareddy Chandrasekhar Reddy Nellore Central Jail Nellore News Latest. Pinnelli Ramakrishna Reddy Pinnelli Venkatrami Reddy vidadala rajani YCP leaders YSRCP YSRCP Mulakath Nellore

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.