Vetlapalem Fire Accident: కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలోని వేట్లపాలెం వద్ద జరిగిన బాణసంచా తయారీ కేంద్రం విస్ఫోటనంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు..ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని పవన్ హామీ ఇచ్చారు.
Read Also: Kakinada Blast Updates: వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు
ఐదు కిలోమీటర్ల దూరం వినిపించిన శబ్ధం
పేలుడు శబ్దం సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకూ వినిపించిందని స్థానికులు చెప్తున్నారు. శబ్దం తీవ్రతకు పక్కనే ఉన్న గ్రామంలో ఓ ప్రైవేటు పాఠశాలలో శ్లాబ్‌కు పగుళ్లు వచ్చినట్లు తెలిసింది. పరిమితికి మించి బాణసంచా తయారు చేయడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: