Vetlapalem fire accident: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం మధ్యాహ్నం సంభవించిన బాణసంచా తయారీ కేంద్రం పేలుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ భీకర ప్రమాదంలో సుమారు 18 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవదహనమవ్వడం అత్యంత విషాదకరం. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ దాదాపు 50 మంది విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే, ఫ్యాక్టరీ షెడ్లు కుప్పకూలిపోవడమే కాకుండా, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిధ్రమైపోయాయి. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలపాలవగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Vetlapalem fire accident: కాకినాడలో భారీ పేలుడు.. 7 కి.మీ మేర వినిపించిన శబ్ధం
ఈ ఘోర కలికలంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయనగరం పర్యటనలో ఉన్న ఆయన, తక్షణమే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి, బాధితులకు అండగా ఉండాలని హోంమంత్రి అనితను ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని, అవసరమైతే మెరుగైన ఆసుపత్రులకు తరలించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అగ్నిమాపక మరియు పోలీసు బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లుగా బాణసంచా కేంద్రాల్లో జరుగుతున్న వరుస ప్రమాదాలు భద్రతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గత ఏడాది 2025 అక్టోబర్‌లో కోనసీమ జిల్లా వి. సావరంలో జరిగిన పేలుడులో 8 మంది ప్రాణాలు కోల్పోగా, 2024లో అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో జరిగిన మరో ప్రమాదంలోనూ 8 మంది మరణించారు. ఇదే తరహాలో తిరుపతి, ఏలూరు జిల్లాల్లోనూ అక్రమ తయారీ కేంద్రాలు, నిల్వ గదుల్లో పేలుళ్లు సంభవించి పలువురు కార్మికులు బలయ్యారు. నిబంధనల ఉల్లంఘన, అజాగ్రత్తే ఈ వరుస మరణాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: