📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Venkaiah Naidu: ఏడాదికి ఒక్కసారే విఐపిలు వెంకన్న దర్శనానికి రావాలి :వెంకయ్యనాయుడు

Author Icon By Sharanya
Updated: July 29, 2025 • 10:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల: ఏడుకొండల వేంకటేశ్వరస్వామి దర్శనానికి విఐపిలు (VIPs) ఏడాదిలో ఒకసారిమాత్రమే పరిమిత సంఖ్యలో కుటుంబసభ్యులను తీసుకురావాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) సూచించారు. దీనివల్ల సామాన్యభక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులందరూ బాధ్యతతో హుందాగా ఈ సూచన పాటించాలని తెలిపారు.

రద్దీకారణంగా సామాన్యభక్తులకు అసౌకర్యం

సామాన్యభక్తుల దర్శనలకు టిటిడి పాలకమండలి, అధికారులు అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. తిరుమల ఆలయంలో ఆనందనిలయం (Ananda Nilayam)లో స్వామివారి దర్శనానికి ఉండే స్థలం, సమయం పరిమితంగా ఉండటంతో ఆలయం వెలుపల ఎంతమంచి ఏర్పాట్లు చేసినా భక్తుల రద్దీకారణంగా సామాన్యభక్తులకు అసౌకర్యం కలుగుతుందన్నారు. శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతో బాటు భక్తుల సౌకర్యాల కల్పనకు మాత్రమే వినియోగించాలని వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) సూచించారు. ప్రతి ఊరిలో ఓ గుడి, బడి ఉండాలని కోరారు. ప్రతి గ్రామంలో ఓ ఆలయాన్ని ఏర్పాటుచేయడానికి టిటిడిలాంటి ధార్మికసంస్థలు ముందుకురావాలని ఆయన సూ చించారు. బడులను ఏర్పాటుచేయడం ప్రభుత్వ కర్తవ్యమన్నారు. టిటిడి అధికారులు సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు సహకరిం చాలని కోరారు. శ్రీవారిసేవకులతోనూ వెంకయ్య మాట్లాడి వారందిస్తున్న సేవలను ప్రశంసించారు.

కుటుంబసభ్యులతో కలసి వైకుంఠమ్ 1 క్యూకాంప్లెక్స్ మార్గంలో ఆలయంలోనికి చేరుకున్నారు. టిటిడి అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి, బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఇఓ లోకనాథం, ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. కుటుంబసభ్యులతో కలసి తొలుత ధ్వజస్తంభం మొక్కారు. అనంతరం ఆనంద నిలయంలోని శ్రీవారిని దర్శించుకున్నారు. కానుకలు సమర్పించారు. రంగనాయుకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అదనపు ఇఒ వెంకయ్యచౌదరి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. వెంకయ్య నాయుడు వెంట ఆలయ డిప్యూటీ ఇఒ లోక నాధం, పేష్కార్ రామకృష్ణ, పారుపత్తేదార్ హిమత్రి ఉన్నారు.

వెంకయ్య నాయుడు తిరుమల దర్శనం గురించి ఏం చెప్పారు?

మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి విఐపిలు ఏడాదికి ఒక్కసారే రావాలని అభిప్రాయపడ్డారు. ఇది సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేందుకు ముఖ్యమైన సూచనగా ఆయన పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎలా స్పందించింది?

ప్రస్తుతం అధికారికంగా ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేదుగానీ, TTD గతంలో కూడా VIP దర్శనాల తగ్గింపుపై చర్యలు తీసుకోవాలనే ప్రయత్నాలు చేసింది. వెంకయ్య నాయుడు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ దిశగా మరోసారి చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read also: AP Metro: విజయవాడ మెట్రోకు గ్రీన్ సిగ్నల్

Breaking News latest news Telugu News TTD latest news Venkaiah Naidu VIP darshan VIP quota Tirumala VIP restrictions Tirupati

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.