📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

FASTag : ఫాస్టాగ్ ఉంటేనే అలిపిరి టోలేట్లో వాహనాలకు అనుమతి!

Author Icon By Shravan
Updated: August 13, 2025 • 10:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల FASTag : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి దేశం నలుమూలల నుండి తమ సొంత వాహనాల్లో, ట్యాక్సీల్లో తిరుమలకు విచ్చేస్తున్న యాత్రికులు “ఫాస్టాగ్” (FASTag) తప్పనిసరిగా ఉంటేనే అలిపిరి టోల్ గేట్ వాహనాలను అనుమతించనున్నారు. ఈ నూతన నిబంధనలు ఆగస్ట్ 15వతేదీ శుక్రవారం ఉదయం నుండి అమలులోకి వస్తున్నాయి. ఫాస్టాగ్ లేని వాహనాలకు అలిపిరి టోల్ గేట్ వద్దే ఐసిఐసిఐ బ్యాంక్ సహకారంతో ప్రత్యేక ఫాస్టాగ్ జారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా యాత్రికులు తమ వాహనాలకు ఫాస్టాగ్ సదుపాయం లేకుంటే ఈ కేంద్రంలో తక్కువ సమయంలోనే ఆ సదుపాయం పొంది .ఆ తరువాత వాహనాల్లో తిరుమలకు చేరుకునేలా చూస్తారు. వాహనాల రద్దీని నియంత్రించడం, భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు కల్పించడంకోసం పారదర్శకమైన సేవలు అందించడమే టిటిడి నిర్ణయం తీసుకున్నట్లు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. ప్రతిరోజూ తిరుమలకు దేశం నలుమూలల నుండి సరాసరి 10 వేలవరకు యాత్రికుల వాహనాలు…6వేలకుపైగా ట్యాక్సీలు, స్థానికుల వాహనాలు, కొండపై వ్యాపారుల వాహనాలు ఇలా 20వేలవరకు తిరుమలకు చేరుతున్నాయి. వాహనాలకన్నిటికీ దాదాపు ఫాస్టాగౌసౌకర్యం కలిగిఉంటారు. తక్కువ సంఖ్యలో వాహనాలకు ఫాస్టాగ్ లేకుండా డిజిటల్ విధానంలో టోల్ గేట్ ఫీజు చెల్లింపులు జరుగుతున్నాయి. ఇకపై ఆ విధానం కూడా స్వస్తిపలికి తప్పనిసరిగా ప్రతి వాహనం ఫాస్టాగ్ ఉంటేనే తిరుమలకు అనుమతించాలని టిటిడి తాజా ఉత్తర్వులు వెలువడించింది.

15నుండి కొత్త నిబంధనలు విధిగా అమలు భద్రత, రద్దీ నియంత్రణ కోసమే నిర్ణయం. ఇదేగాక 450వరకు ఆర్టీసి బస్సులు అలిపిరి టోల్ గేట్ దాటుకుని వస్తుంటాయి. అక్కడ సప్తగిరి తనిఖీ కేంద్రంలో 12, 13 లేన్లు వరకు వాహ నాలను అనుమతినిస్తున్నారు. వాహనా లను తనిఖీ చేసుకోవడమేగాక వాటికి టోల్ ఫీజు కూడా చెల్లించడం తప్పనిసరి. దీనివల్ల వాహనాలు కిలోమీటర్లు బారులుతీరుతున్నాయి. టోల్ గేట్లో (Toll gate) వాహనాలకు ఫాస్టాగ్ అమలుచేస్తే మరింత త్వరగా వాహనాలు తిరుమలకు కదిలే వీలుంటుందని టిటిడి భద్రత వర్గాలు సూచించాయి. ఎక్కడ నుండైనా తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ సౌకర్యం తప్పనిసరి చేస్తూ టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త నిబంధనలు ఆగస్ట్ 15 నుండి అమల్లోకి వస్తున్నాయి. ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమల ఘాట్లో ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించడం జరగదని చైర్మన్ నాయుడు తెలిపారు. టిటిడి తీసుకున్న మార్పులను భక్తులు కూడా పాటించి టిటిడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

alipiri tollgate Breaking News in Telugu FASTag Latest News in Telugu Telugu News tirupati vehicle entry rules

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.