📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం అర్ధరాత్రి చిరుత కలకలం.. సీసీటీవీలో దృశ్యాలు నేటి నుండి విజయవాడ లో పుస్తకాల పండుగ ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం కానుక గంటల్లోనే శ్రీవారి దర్శనం.. భక్తులకు తప్పిన సుదీర్ఘ నిరీక్షణ గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం

News Telugu: Veerabrahmendra Swamy: బ్రహ్మంగారి మఠంలో కూలిన వీరబ్రహ్మేంద్ర స్వామి గృహం

Author Icon By Rajitha
Updated: October 30, 2025 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Veerabrahmendra Swamy: కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠంలో దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి (Potuluri Veerabrahmam) నివాసంగా ఉన్న సుమారు 350 ఏళ్ల ప్రాచీన భవనం కూలిపోయింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోడలు బలహీనపడి శిథిలమై కూలినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఘటన సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Read also: TTD: కల్తీ నెయ్యి.. మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అరెస్ట్

Veerabrahmendra Swamy

Veerabrahmendra Swamy: విషయం తెలిసిన వెంటనే పూర్వ మఠాధిపతుల కుమారులు వెంకటాద్రి స్వామి, వీరంభట్లయ్య స్వామి, దత్తాత్రేయ స్వామి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు భవనం చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ, వర్షాల ప్రభావంతో అది బలహీనపడిందని తెలిపారు. ఈ ప్రాచీన కట్టడాన్ని పునర్నిర్మించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే పునర్‌నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వారు పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఘటనపై భక్తులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, పవిత్ర స్థలాన్ని యథాతథంగా పునర్నిర్మించాలని కోరుతున్నారు.

బ్రహ్మంగారి మఠంలో ఏమి జరిగింది?
కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో 350 ఏళ్ల నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి గృహం వరుస వర్షాల కారణంగా కూలిపోయింది.

ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా?
లేదు, ఘటన జరిగిన సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Brahmangari Matham Kadapa news latest news Telugu News Veerabrahmendra Swamy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.