📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

News Telugu: Vedas: వేదాల ప్రాశస్త్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలి: ఎన్ వి రమణ

Author Icon By Rajitha
Updated: October 15, 2025 • 2:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vedas: నందంపూడి వేద సభలో మాజీ సిజెఐ జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramana) తూర్పుగోదావరి జిల్లా : వేద భూమిగా పేరొందిన భారతదేశంలో వేదాలకు తగిన గుర్తింపు లభించడం లేదని, వేద సభలు గ్రామ స్థాయిలో కాకుండా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో నిర్వహిస్తే వేదాల ప్రాశస్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పడంతో పాటు వేదాలకు, వేద (vadaas) పండితులకు ఎంతో గుర్తింపు లభించి వారి ఆర్థిక సమస్యలు తీరుతాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అభిప్రాయపడ్డారు. నందంపూడిలో వడ్లమాని లక్ష్మినారాయణ అవధాని స్మృత్యర్థం ఆయన కుమారుడు సుబ్రహ్మణ్య ఘనాపాటి ఆధ్వర్యంలో వడ్లమాని లక్ష్మినారాయణ మెమోరియల్ ట్రస్ట్ పేరిట వేద సభను మంగళవారం నిర్వహించారు. మహా మహోపాధ్యాయ శాస్త్రనిధి బ్రహ్మశ్రీ విశ్వనాధ గోపాలకృష్ణశాస్త్రి అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటరమణ మాట్లాడుతూ భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లని, దక్షిణ భారతదేశంలోని కోనసీమ ప్రాంతం వేద పండితులకు పుట్టిల్లన్నారు.

Soumya Shetty: నటి సౌమ్యశెట్టిపై తెలంగాణ వాసి చీటింగ్ కేసు

వేద పండింతులకు ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయని అయినప్పటికీ వేదాల ప్రాశస్యాన్ని, అర్థాలను సమాజానికి చాటిచెబుతున్నారన్నారు. Vedas వేదాలను పటించడం వలన మాతృ భాషను, సంస్కృతిని పెంపొందించుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా వడ్లమాని లక్ష్మినారాయణ అవధాని మోమోరియల్ ట్రస్ట్కు రూ.2 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి ఆస్థాన వేద పండితులు ఉపాధ్యాయుల కాశీపతి సోమయాజి ఘనాపాటి, టిటిడి శ్రీ వెంకటేశ్వర హయ్యర్ వేదిక్ స్టడీస్ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ దువ్వూరి ఫణి యజ్జేశ్వరయాజులు, టిటిడి బోర్డు మాజీ సభ్యులు డొక్కా నాధ్ బాబు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పేరి కామేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యురాలు వడ్లమాని పద్మావతి, అనుపిండి బాబి, నూకల శంభూ ప్రసాద్, వడ్లమాని కామేశ్వరరావు, అరిగెల బలరామ్మూర్తి, పితాని వీరాస్వామి, డీఎస్పీ సుంకర మురళీమోహన్, సిఐ ఆర్. భీమరాజు, తహసీల్దార్ బి. చిన్నబాబు, అధిక సంఖ్యలో టిటిడి ఆస్థాన వేదపండితులు పాల్గొన్నారు. వడ్లమాని సుబ్రహ్మణ్య అవధాని తన మనమడు ప్రముఖ వేదపండితుడు ఉపాధ్యాయుల సుబ్రహ్మణ్య రవితేజ ఘనాపాటికి బహుకరించిన సింహతలాటం, ఒక లక్ష రూపాయల నగదును జస్టిస్ వెంకటరమణ రవితేజ ఘనాపాటి చేతికి అలంకరించి, నగదును అందించి సత్కరించారు.

జస్టిస్ ఎన్వీ రమణ వేద సభలో ఏ సందేశం ఇచ్చారు?
వేదాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని, వేద పండితులకు గుర్తింపు ఇవ్వాలని చెప్పారు.

వేద సభను ఎవరు నిర్వహించారు?
వడ్లమాని లక్ష్మీనారాయణ అవధాని మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Justice NV Ramana latest news Telugu News Ved Sabha Vedas Vedic Scholars

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.