📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Vangalapudi Anitha: యోగా నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు – మంత్రి అనిత

Author Icon By Anusha
Updated: June 18, 2025 • 10:29 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయనగరం : యోగా జీవన విధానంలో భాగం కావాలనే ఉద్దేశ్యంతో ప్రధాని మోడీ యోగా కార్యక్రమానికి అత్యంత ప్రధాన్యతనిస్తున్నారని, ఒకే రోజు ఒకే చోట 5 లక్షల మందితో విశాఖపట్నంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇన్ చార్జ్ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్ చార్జ్ మంత్రి రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాల శాఖామంత్రి బి.సి.జనార్ధన్ రెడ్డిలతో కలసి ఈ నెల 21న నిర్వహించే యోగా కార్యక్రమంపై మూడు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతో, అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్ చార్జ్ మంత్రి మాట్లాడుతూ ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీక్ష బూనారని, ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు.

యోగా కార్యక్రమానికి

నెల రోజుల నుండి యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరినీ సన్నద్ధం చేయడం జరుగుతోందని తెలిపారు. విశాఖపట్నం (Visakhapatnam) లో ఒకే రోజున ఒకే వేదిక నుండి 5 లక్షల మంది యోగ చేయడం ద్వారా దేశమంతా వైజాగ్ వైపు చూస్తుందని, అంతే కాకుండా గిన్నిస్ బుక్ స్థానం సంపాదిస్తామని పేర్కొన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలనీ కోరారు. యోగా కార్యక్రమానికి వచ్చే వారికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బస్సులను వేసి రహదారి మార్గంలో అత్యవసరాల కోసం వాష్ రూమ్స్ న్ను గుర్తించడం జరిగిందని, వాటిని బస్సులతో మ్యాప్ చేయడం జరిగిందని, అలాగే మెడికల్ ఎమర్జెన్సీ కోసం కూడా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.

Vangalapudi Anitha

ప్రతి ఒక్కరూ

ఉదయాన్నే బస్సులు బయలుదేరతాయి కావున ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం కావాలని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. నియోజకవర్గం (Constituency) వారీగా సచివాలయం వారీగా నమోదు చేసుకున్న జాబితాలను సంబంధిత శాసన సభ్యులకు ఇవ్వాలని, వారు వారి కార్యకర్తల ద్వారా జన సమీకరణ లో భాగస్వామ్యులవుతారని తెలిపారు.సురక్షితంగా గమ్యాలను చేరే వరకు ఇన్ ఛార్జ్ లు బాధ్యత తీసుకోవాలని, అలాగే ట్రాఫిక్ నియంత్రణకు జాతీయ రహదారిపై హెవీ వాహనాలను తిరగకుండా నిరోధించాలని సూచించారు.

జాగ్రత్తగా తీసుకువెళ్లాలని

యోగా వేదిక వద్ద కంపార్ట్మెంట్లను కేటాయించడం జరుగుతుందని, ఎవరికీ ఏ కంపార్ట్మెంట్ కేటాయించారో, ఆ నెంబర్ వారు వెళ్ళే బస్సు పైన రాయడం జరుగుతుందని దాని ప్రకారంగా ఎటువంటి ఆందోళన పడకుండా ఇన్ ఛార్జ్ జాగ్రత్తగా తీసుకువెళ్లాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మాట్లాడుతూ జిల్లా నుండి 36 వేల మందిని సిద్ధం చేసుకున్నామని, కనీసం 30 వేల మందిని పంపడానికి 2 రూట్లలో 660 బుస్సు లను సిద్ధం చేసామని, ప్రతి బస్సు కు ఒక లైజెన్ అధికారిని నియమించామని, సచివాలయం వారీగా బస్సులను, టాయిలెట్లను మాప్ చేయడం జరిగిందని తెలిపారు.

Read Also: Operation Sindoor : వీరజవాన్ మురళీ కుటుంబానికి ఆర్థికసాయం అందజేత

#InternationalYogaDay #Vangalapudi Anitha #VisakhapatnamYogaEvent #YogaForLife #YogaWithModi Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.