📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vangalapudi Anitha: వైసిపిదంతా హింసాత్మక రాజకీయం

Author Icon By Tejaswini Y
Updated: February 4, 2026 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పాలనకు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు ఎలాంటి పొంతన లేదని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ మాట్లాడుతూ.. గత రెండు రోజుల్లో జరిగిన పరిణామాలను ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ కార్యకర్తల కోపాన్ని అదుపు తప్పకుండా సంయమనం పాటించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

Read Also: Rajamahendravaram tiger news : రాజమండ్రిలో పెద్దపులి కలకలం, స్కూల్ పక్కనే సంచారం! ప్రజల్లో భయం

Vangalapudi Anitha: YSRCP is all about violent politics

అదుపులో పెట్టాం కాబట్టే రాష్ట్రంలో మంచి వాతావరణం

నాయకులకు వాస్తవాలను వివరించి, రాష్ట్రాభివృద్ధి లక్ష్యాలను గుర్తు చేసి.. వైసీపీ ఉచ్చులో పడకుండా నియంత్రించామన్నారు హోంమంత్రి. టీడీపీ కార్యకర్తలను గత 20 నెలలుగా పూర్తి అదుపులో పెట్టాం కాబట్టే రాష్ట్రంలో మంచి వాతావరణం నెలకొందని తెలిపారు. కార్యకర్తల కడుపు మంటను అర్థం చేసుకున్నప్పటికీ, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా సరైన సమయంలో హితబోధ చేసిన నాయకుడు చంద్రబాబు అని అనిత కొనియాడారు. బూతులు, హింసాత్మక చర్యలతో వైసీపీ నేతలను ప్రోత్సహించారే తప్ప ఏనాడైనా తప్పని చెప్పారా అంటూ జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రిమినల్ ఆలోచనలతో రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు వైసీపీ యత్నిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని మంత్రి అనిత హెచ్చరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

AP Home Ministry AP News Chandrababu Naidu Home Minister Anitha TDP vs YSRCP vangalapudi anitha YS Jagan Mohan Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.