Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత గురువారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు బీపీలో హెచ్చుతగ్గులు కనిపించడంతో సిబ్బంది వెంటనే ముందు జాగ్రత్త చర్యగా ఆమెను హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Read Also: vote: ప్రజల ఓటు విలువ కోల్పోతుందా?
“నేను బాగున్నాను”.. మంత్రి అనిత స్పందన
ఆస్పత్రికి చేరుకున్న వెంటనే వైద్య బృందం మంత్రి అనితకు అత్యవసర పరీక్షలు నిర్వహించింది. బీపీలో తేడాల వల్ల అలసటగా అనిపించినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పూర్తిగా స్థిరంగా ఉందని, ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ పేర్కొన్నారు.
తను ఆస్పత్రిలో చేరిన వార్తతో కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందడంతో మంత్రి అనిత స్వయంగా స్పందించారు. “నా ఆరోగ్యం బాగానే ఉంది, ఎవరూ ఆందోళన చెందవద్దు. గత కొద్ది రోజులుగా వరుస కార్యక్రమాల వల్ల కలిగిన కొద్దిపాటి అలసట కారణంగా చిన్న ఇబ్బంది ఏర్పడింది. ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకున్నాను” అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలోనే ఆమె డిశ్చార్జ్ అయ్యి తిరిగి విధుల్లో పాల్గొంటారని సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: