📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vangalapudi Anitha: మహిళలపై నేరాలు 4.4శాతం తగ్గాయి

Author Icon By Saritha
Updated: March 3, 2026 • 1:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడలో అవగాహన ర్యాలీలో హోంమంత్రి అనిత

Vangalapudi Anitha: మహిళా భద్రత వారోత్సవాల సందర్భంగా విజయవాడ సత్యనారాయణపురం సిగ్నల్ నుండి శివాజీ గేటు వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, ఐజి రాజకుమారి, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఎస్పీ సరిత, ఈగల్ ఎస్పీ నగేష్, బాబు తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో మహిళా భద్రతపై నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు.

Read Also: MP Daggumalla Prasad Rao: అపోలో యూనివర్సిటీలో ‘వికసిత్ భారత్

Vangalapudi Anitha: Crimes against women have decreased by 4.4 percent

వనిత భద్రత సమాజ భద్రతకు మూలస్తంభం

ఈ సందర్భంగా హోం మంత్రి అనిత శక్తి టీమ్ బ్రోచరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఎన్డీయే ప్రభుత్వం మహిళా రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు 4.4శాతం తగ్గినట్లు వెల్లడించారు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, మహిళ సాధికారత సాధిస్తే కుటుంబం మొత్తం సాధికారత సాధించినట్లేనని చెప్పారు.

మహిళ భద్రత సమాజ భద్రతకు మూలస్తంభమని, మహిళా అభివృద్ధి దేశ అభివృద్ధికి కొలమానమని పేర్కొన్నారు. ఆడ, మగ తేడా లేకుండా పిల్లలను సమానంగా పెంచాలని, ఆడపిల్లలతో పాటు మగపిల్లలను కూడా బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రతి ఆడపిల్లను తల్లి, సోదరి భావనతో గౌరవించాలని, మహిళల పట్ల గౌరవం ఇంటి నుంచే ప్రారంభమవ్వాలని అన్నారు. పిల్లలకు కోట్ల ఆస్తి కంటే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం, పరిష్కార శక్తి ఇవ్వడం ముఖ్యమని, తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా ఉండాలని సూచించారు.

మహిళా రక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత

ఒక తల్లి ప్రసవ వేదనను మాటల్లో చెప్పలేమని, మహిళల శక్తి అపారమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్త్రీల పక్షపాతిగా ఉన్నారని, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ఆస్తుల్లో మహిళలకు సమాన వాటా తీసుకువచ్చినది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు అని గుర్తుచేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై “సెక్సువల్ అఫెండర్ షీట్” ఓపెన్ చేసి, కఠిన నిఘా ఏర్పాటు చేస్తామని హోం మంత్రి స్పష్టం చేశారు. మహిళలను గౌరవిస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Crimes against women decreased Home Minister Vangalapudi Anitha Vijayawada awareness rally women safety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.