కోస్తా ఆంధ్రప్రదేశ్–తమిళనాడు మధ్య ప్రయాణికులకు శుభవార్త. డిసెంబర్ 15 నుంచి నర్సాపూర్–చెన్నై మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్(VandeBharat) పరుగులు తీయనుంది. ఇప్పటివరకు చెన్నై సెంట్రల్–విజయవాడ వరకు పరిమితమైన ఈ సెమీ హైస్పీడ్ రైలును(Semi-high-speed train) గుడివాడ, భీమవరం మీదుగా నర్సాపూర్ వరకు విస్తరించారు. దీంతో ఏసీ సౌకర్యాలతో వేగవంతమైన ప్రయాణం కోరుకునే వారికి ఈ రైలు అందుబాటులోకి రానుంది.
Read Also: Maggi Capsule: వైరల్ మ్యాగీ క్యాప్సూల్ వీడియోల వెనుక అసలు నిజం ఇదే!
9 గంటల్లో 655 కి.మీ ప్రయాణం..
ఈ వందే భారత్(VandeBharat) రైలు 655 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 8 గంటల 55 నిమిషాలు–9 గంటల్లో పూర్తి చేస్తుంది. మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు ఈ సర్వీస్ నడుస్తుందని అధికారులు తెలిపారు. లాంఛన ప్రారంభోత్సవం అనంతరం డిసెంబర్ 17 నుంచి ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
నర్సాపూర్–చెన్నై మార్గంలో ఇదే తొలి వందే భారత్ కావడంతో వాణిజ్య కార్యకలాపాలు, వ్యాపార ప్రయాణాలు, పర్యాటకం మరింత పెరుగుతాయని అంచనా. ఈ రైలు రేణిగుంట జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, భీమవరం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది.
రైలు షెడ్యూల్:
- నర్సాపూర్ → చెన్నై: మధ్యాహ్నం 2:50కు బయలుదేరి రాత్రి 11:45కు డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది.
- చెన్నై → నర్సాపూర్: ఉదయం 5:30కు బయలుదేరి మధ్యాహ్నం 2:10కు నర్సాపూర్ చేరుకుంటుంది.
టికెట్ ధరలు:
- AC చైర్ కార్: ₹1,635
- ఎగ్జిక్యూటివ్ చైర్ కార్: ₹3,030
ఆధునిక సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణంతో ఈ వందే భారత్ రైలు ప్రయాణికులకు ప్రీమియం అనుభవాన్ని అందించనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: