గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ మైనింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (High Court) ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ సతీశ్ శర్మ, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం,ఈ నిర్ణయం వెలువరించింది.ఈ సందర్భంగా అక్రమ మైనింగ్ కేసు (Illegal mining case) లో ఏపీ ప్రభుత్వ వాదనలు వినకుండా వంశీకి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది.
మెరిట్స్ ఆధారంగా
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. ఇరువురి వాదనలు విని, మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. తాము కేసు మెరిట్స్ తో పాటు, పీటీ వారెంట్స్ (PT Warrants) లోకి వెళ్లడం లేదని తెలిపింది. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో, ప్రభుత్వం (Government) కౌంటర్ దాఖలు చేసిన నాలుగు వారాల్లో విచారణ ముగించి తీర్పు ఇవ్వాలని ధర్వాసనం ఆదేశించింది.
వల్లభనేని వంశీ ఎవరు?
వల్లభనేని వంశీ ఒక రాజకీయ నాయకుడు. ఆయన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. వంశీ ఒక వ్యాపారవేత్త, సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు పొందారు.
వంశీ కుటుంబం గురించి సమాచారం ఉందా?
వంశీ వ్యక్తిగత జీవితాన్ని గోప్యతగా ఉంచే ప్రయత్నం చేస్తారు. కుటుంబం గురించి ప్రభుత్వంగానీ, మీడియాలోగానీ ఎక్కువ సమాచారం లేదు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Nellore: జిల్లా జైలు నుంచి ఖైదీ పరార్ వెంకటాచలంలో కేసు నమోదు