📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Vallabhaneni Vamsi: మళ్లీ అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ

Author Icon By Anusha
Updated: July 7, 2025 • 6:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత, గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది ఎదురవడంతో ఆయనను కుటుంబ సభ్యులు తక్షణమే విజయవాడ (Vijayawada) లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
వంశీకి శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది తలెత్తడంతో, కుటుంబ సభ్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న వెంటనే వైద్యులు ఆయనకు అత్యవసర సేవలు అందించారు.

వైద్యులు సూచించినట్లు

ప్రస్తుతం వల్లభనేని వంశీ ఆరోగ్యాన్ని ఓ ప్రత్యేక వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగానే ఉన్నప్పటికీ, మరికొన్ని రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో కోలుకునే వరకు ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉండనున్నారని సమాచారం. కాగా.. ఫిబ్రవరి13న సత్యవర్ధన్ కిడ్నాప్‌ కేసులో వంశీ (Vallabhaneni Vamsi) అరెస్ట్‌ అయ్యారు. ఆతర్వాత ఆయనపై గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సహా మొత్తం 11 కేసులు నమోదయ్యాయి.

Vallabhaneni Vamsi: మళ్లీ అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ

అక్రమ మైనింగ్

వంశీపై నమోదైన 11 కేసుల్లోనూ బెయిల్‌ మంజూరు కావడంతో వంశీ జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో వంశీకి ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు (Supreme Court) హైకోర్టు తీర్పును సమర్థిస్తూ బెయిల్ రద్దుకు నో చెప్పింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కూడా కోర్టు వంశీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష నగదు, ఇద్దరు వ్యక్తుల షూరిటీతో పాటు వారానికి రెండు సార్లు పోలీస్ స్టేషన్‌కి రావాలనే కండీషన్‌తో బెయిల్ మంజూరు చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: AP Weather: ద్రోణి ప్రభావం తో ఆంధ్రలో వర్షాలు

వల్లభనేని వంశీ గురించి?

ప్రస్తుతం వైసీపీలో కీలక నేతగా మారారు. గన్నవరం ఎమ్మెల్యే అయినా విజయవాడ రాజకీయాలను ప్రభావితం చేయగల నేత.

ప్రస్తుతం వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది?

వైద్యుల ప్రకారం వంశీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆయనను ఒక ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షిస్తోంది.

Breaking News gannavaram ex mla vamsi health latest news telugu nes vallabhaneni vamsi health update vallabhaneni vamsi hospitalized vamsi sudden illness news ycp leader vallabhaneni vamsi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.