📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Vallabhaneni Vamsi: నిలకడగా వంశీ ఆరోగ్యం: వైద్యులు

Author Icon By Sharanya
Updated: May 27, 2025 • 4:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి (Vallabhaneni Vamsi) ప్రస్తుతం కోర్టు నుంచి ఊరట లభించకపోవడంతో, ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఆయనపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఇప్పటికే జైలు జీవితం అనుభవిస్తున్న వంశీకి ఆరోగ్యపరంగా సమస్యలు నెలకొనటంతో వైద్యులు, జైలు అధికారులు, పోలీసులు ఓవైపు కోర్టు నిబంధనలు మరోవైపు తలెత్తిన పరిస్థితి రాజకీయ, న్యాయ, ఆరోగ్య రంగాల్లో వివాదాస్పదంగా మారింది.

బెయిల్ దరఖాస్తు తిరస్కరణ: నూజివీడు కోర్టు తీర్పు

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్టయిన వల్లభనేని వంశీ బెయిల్ కోసం నూజివీడు కోర్టును ఆశ్రయించారు. అయితే వంశీ బెయిల్‌ పిటిషన్లను కోర్ట్ డిస్మిస్‌ చేసింది. ఈ తీర్పుతో వంశీకి మరికొన్ని రోజులు జైలు జీవితం తప్పని పరిస్థితి అయ్యింది.

వైద్యుల సూచనల ప్రకారం వైద్యం

జైల్లో ఉన్న వంశీకి ఇటీవల శ్వాస సంబంధిత సమస్యలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్య ఆ సమస్య మరింత తీవ్రం కావడంతో జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. సోమవారం కూడా తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వంశీకి స్లీప్ టెస్ట్ నిర్వహించాలని వైద్యులు సూచించారు. విజయవాడ (Vijayawada) జీజీహెచ్‌లో న్యూరాలజీ స్పెషలిస్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో గుంటూరు GGHకి తీసుకెళ్లారు. అయితే జీజీహెచ్‌లో స్లీప్‌ టెస్ట్ సౌకర్యం లేకపోవడంతో పల్మనాలజీ వైద్యుల ఆధ్వర్యంలో కొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. వంశీకి బీపీ, షుగర్ నార్మల్‌గానే ఉన్నాయి. అతని ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ప్రస్తుతం వంశీ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఔట్ పేషెంట్‌గా చికిత్స తీసుకోవచ్చన్నారు.

వల్లభనేని వంశీ చికిత్స పొందుతున్న జీజీహెచ్ (విజయవాడ)కి ఆయన భార్య పరామర్శకు వచ్చారు. అయితే పోలీసులు ఆమెను లోపలికి అనుమతించలేదు. దీనికి కారణంగా కోర్టు అనుమతి లేకపోవడంను పేర్కొన్నారు. ప్రస్తుతానికి వంశీపై కేసు విచారణలో ఉండటంతో, అతనిని కలుసుకునేందుకు కోర్టు ఆమోదం తప్పనిసరిగా మారింది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య కూడా శారీరకంగా సమావేశం జరగలేని పరిస్థితి నెలకొంది.

Read also: Pawan Kalyan: సినిమా హాళ్ల నిర్వహణపై పవన్ సంచలన ప్రకటన

#AndhraNews #AndhraPradesh #APPolitics #VallabhaneniVamsi #VamsiHealthUpdate #VamsiRecovery Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.