📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vaikunta Ekadashi: కాణిపాకంలో విఐపిల రద్దీ

Author Icon By Saritha
Updated: December 31, 2025 • 12:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గణనాధుని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

కాణిపాకం : వైకుంఠ ఏకాదశి పండుగ పర్వదినం సందర్భంగా మంగళవారం పలువురు ప్రముఖులు కుటుంబసమేతంగ (Vaikunta Ekadashi) కాణిపాకం శ్రీవరసిద్ది వినాయకస్వామి వారిని వేర్వేరుగా దర్శించుకున్నారు. ఈమేరకు ప్రధాన ఆలయ పునర్నిర్మాణ, బంగారు, వెండి వాకిలి దాతలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మల్లిఖార్జునరావు, కృష్ణాజిల్లా పెడన ఎమ్మెల్యే కాగితపు కృష్ణప్రసాద్, తెలంగాణా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్(Gaddam Prasad), తెలంగాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాదశీదేవి, రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమీషనర్ చావలి సునీల్ లు కుటుంబసమేతంగా వేర్వేరుగా దర్శించుకున్నారు.

Read also: Pawan Kalyan: డ్రెయిన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన

నవగ్రహ ఆలయంలో పూజలు

ఆలయ దర్శనార్థం వచ్చిన వారికి ఆలయ ఈఓ కె.పెంచల కిషోర్, అర్చకులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. (Vaikunta Ekadashi) అనంతరం శ్రీవీరాంజనేయస్వామి ఆలయం, నవగ్రహ ఆలయంలలో కూడా పూజలు నిర్వహించారు. వారికి వేదమంపడపంలో వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బాలాజినాయుడు, రవి, పాలకమండలి సభ్యులు నరేష్, సుబ్బారెడ్డి, చిత్తూరు కోర్టు సిబ్బంది, ప్రోటోకాల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Andhra Pradesh Kanipakam Latest News in Telugu Sri Varasiddhi Vinayaka Temple Telugu News Temple VIP Darshan Vaikunta Ekadashi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.