📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు ప్రజలకు కూటమి సర్కార్ గుడ్‌న్యూస్.. కరెంట్ ఛార్జీల తగ్గింపు ఇంటర్ పరీక్షల్లో కొత్త మార్పులు వారికి ఫ్రీగా సోలార్ రూఫ్ టాప్: మంత్రి గొట్టిపాటి విజయవాడలో సైబర్ క్రైమ్ ముఠా అరెస్ట్ రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి నేటి నుంచి స్కూళ్లలో ఆధార్ క్యాంపులు

Vadde Obanna Jayanti: రాష్ట్ర పండుగగా వడ్డే ఓబన్న జయంతి

Author Icon By Rajitha
Updated: January 5, 2026 • 11:23 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటీష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్య్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి (Vadde Obanna Jayanti) వేడుకలను ఈ నెల 11వ తేదీన రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఓబన్న జయంతిని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, అనంతపురం పట్టణంలో రాష్ట్ర స్థాయి జయంతిని నిర్వహించనున్నామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు నేతృత్వంలో వడ్డెర సామాజిక వర్గీయులు మంత్రి సవితను కలిసి, వడ్డే ఓబన్న జయంతిపై చర్చించారు.

Read also: Telugu States: నేడు సుప్రీంకోర్టులో జల వివాదాల కేసు విచారణ?

Vadde Obanna Jayanti declared as a state festival

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, బీసీల ఆత్మగౌరవానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తూ, విశ్మకర్మ, వాల్మీకి, కనకదాస, భగీరథ, వడ్డే ఓబన్న, గౌతు లచ్చన్న జయంతులను అధికారికంగా నిర్వహించామన్నారు. బీసీల ముద్దు బిడ్డ, స్వాతంత్య్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతిని ఈ నెల 11న రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నామన్నారు. పట్టణంలో ఓబన్న రాష్ట్ర స్థాయి జయంతిని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓబన్న జయంతికి రాష్ట్ర పండుగగా నిర్వహించేలా గతంలోనే కూటమి ప్రభుత్వం శాశ్వత జీవో జారీచేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

బ్రిటీష్ పాలకుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చేసిన పోరాట పటిమను భవిష్యత్ తరాలవారికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన జయంతి నిర్వహణను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించారన్నారు. వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడంపై ఆయన సామాజిక వర్గీయులు హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు, మంత్రి సవితకు ధన్యవాదాలతెలియజేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, డైరెక్టర్లు, వడ్డెర సామాజిక వర్గీయులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Andhra Pradesh politics latest news state festival Telugu News Vadde Obanna

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.