📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

VAA : కృష్ణా, కర్నూలు జిల్లాల్లో విఎఎల బదలీలు రద్దు

Author Icon By Shravan
Updated: August 20, 2025 • 1:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ VAA : నిబంధనలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే గ్రామ సచివాలయాల్లోని గ్రామ వ్యవసాయ సహాయకుల (VVA) లను బదిలీ చేయడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఉమ్మడి కర్నూలు, కృష్ణా జిల్లాల్లో జరిగిన బదిలీలను రద్దు చేసింది. గత మే, జూన్ నెలల్లో వెలువడిన జీవోలు 23, 5లకు అనుగుణంగా కౌన్సెలింగ్/ బదిలీలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పై రెండు జిల్లాల్లో అత్యధికంగా ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకే బదిలీలు జరిగాయని గుర్తించింది. పారదర్శకత, వ్యక్తిగతాభిమానం, ఆశ్రిత పక్షపాతం అడు కోవాలని పేర్కొంది. సిఫార్సులను యాంత్రి G కంగా జిల్లా కలెక్టర్లు ఆమోదించారని తప్పుపట్టింది. రూల్స్ ప్రకారమే బదిలీలు జరిగాయన్న ప్రభుత్వ వాదనను కొట్టివేసింది. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుగుణంగా బదిలీలు జరిగాయని, ఈ విషయాన్ని ప్రభుత్వం ఖండించలేదని చెప్పింది. బాధ్యత నుంచి అధికారులు తప్పుకున్నట్లు ఉన్నారని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ న్యాపతి విజరు ఇటీవల ఆదేశాలిచ్చారు.

బదిలీ జరిగిన తీరును సవాలు చేస్తూ కడప, అన్నమయ్య, అనంతపురం, ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి కర్నూలు జిల్లాలకు చెందిన గ్రామ వ్యవసాయ సహాయకులు పెద్ద సంఖ్యలో పిటిషన్లు వేశారు. ఆ రెండు జిల్లాల్లోనే 217 మంది బదిలీకి ఎంపీ, ఎమ్మెల్యేలు సిఫారసు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 115 మంది, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 102 మందిని బదిలీ చేయాలని ప్రజాప్రతి నిధులు సిఫార్సులు చేశారు. ఈ రెండు జిల్లాల్లో జరిగిన బదిలీలను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు (High Court) ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో ప్రజా ప్రతినిధుల సిఫార్సులు పెద్దగా లేవని, బదిలీల్లో జోక్యం చేసుకోబోమని ప్రకటించింది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/urea-shortage-harish-rao-is-angry-over/telangana/533104/

Andhra Pradesh government orders Breaking News in Telugu Krishna Kurnool transfers Kurnool district news Latest News in Telugu Telugu News Paper Village assistant transfers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.