📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

V. Srinivasa Rao: రెండు రాష్ట్రల మధ్య జల వివాదాలను పెంచుతున్న కేంద్రం : శ్రీనివాసరావు

Author Icon By Sharanya
Updated: July 19, 2025 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: పోలవరం -బనకచర్లపై ప్రాజెక్ట్పై ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కేంద్ర ప్రభుత్వ శల్యసారధ్యంతో జలవివాదాలను మరింత జటిలం చేసే విధంగా వుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి v. శ్రీనివాసరావు (V. Srinivasa Rao) వ్యాఖ్యానించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కేంద్ర జలవనరులశాఖ మంత్రి సిఆర్ పాటిల్ (CR Patil) సమక్షంలో జరిగిన సమావేశం బనకచర్ల ప్రాజెక్టు వివాదాన్ని పరిష్కరించకపోగా, గోదావరి, కృష్ణా నదీ జలాల వివాదాల తేనెతుట్టేను కదల్చే విధంగా వుందని రాష్ట్ర కమిటీ అభిప్రాయపడిందని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నదానికి భిన్నంగా ఏమి జరిగినా అది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేస్తుంది.

ఈ కమిటీ ఆ నిర్ణయానికి లోబడి వ్యవహరించాలి అని ఆయన కోరారు. తక్షణం అఖిలపక్ష సమావేశం వేసి ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశ వివరాలను, నిపుణుల కమిటీ విధివిధానాలను ప్రజలకు స్పష్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రూ.82 వేల కోట్ల ప్రతిపాదనలతో బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project)ను మూడు సంవత్సరాల్లో నిర్మిస్తామని కూటమి ప్రభుత్వం గత కొన్ని నెలలుగా పెద్దఎత్తున హడావుడి చేస్తున్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వ జోక్యం ద్వారా పరిష్కరించుకోనున్నట్లు మీడియాలోనూ వార్తలు వచ్చాయని, ఈ సమావేశంలో అదికూడా చర్చకు రాలేదని తెలిపారు. కృష్ణా జలాల విషయంపై తెలంగాణ ప్రభుత్వం చాలా కాలంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోందని, ఈ నీటిలో తనకు సగభాగం కావాలని డిమాండ్ చేస్తోందని
పేర్కొన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుండి విద్యుత్ ఉత్పత్తి పేరుతో కనిష్ట నీటిమట్టానికంటే దిగువనున్న నీటిని కూడా తెలంగాణ ప్రభుత్వం తోడేస్తుందని మన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కూడా విమర్శించిందని తెలిపారు. గోదావరి వరద జలాలను మళ్లించి రాయలసీమలో సాగునీటి వనరులను పెంచడంతో పాటు, కృష్ణా ఆయకట్టు స్థిరీకరణకు పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. బనకచర్ల భారమని దానికంటే ముందు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సిపిఎం డిమాండ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా బనకచర్ల ప్రాజెక్టు అసాధ్యమని తేల్చిందని వివరించారు .

Read hindi news: hindi.vaartha.com

Read also: Durgamma Saare: భాగ్యనగర్ అమ్మవార్లకు దుర్గమ్మ ఆషాఢం సారె

Andhra Telangana water issue Breaking News central government criticism inter-state water sharing latest news Telugu News V. Srinivasa Rao water disputes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.