📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

V. Srinivasa Rao: మామిడి రైతులను ఆదుకోండి -సిఎం చంద్రబాబుకు సిపిఎం లేఖ

Author Icon By Sharanya
Updated: July 8, 2025 • 11:08 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ: మామిడి రైతులను సంక్షోభం నుండి ఆదుకోడానికి నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు (V. Srinivasa Rao) ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ఈ లేఖలో మామిడి రైతులకు (mango farmers) కిలో రూ.12లు చొప్పున ధర ఇవ్వాలని అందులో రూ.4లు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందని, మిగతా మొత్తం కిలోకు రూ.8లు మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు అందించాలని ప్రభుత్వం నుండి మీరు ఇచ్చిన ఆదేశాలు ఏమాత్రం అమలు కాలేదు. మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు సిండికేట్గా ఏర్పడి కిలో రూ.4లకు మించి కొనడం లేదు.

కనీస ధర ప్రకటించాలి

మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు రైతులను నిలువునా ముంచుతున్నారు. కాబట్టి పరిశ్రమల గుత్తాధిపత్యం నుండి రైతుల్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ ఏజెన్సీల ద్వారా ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని కొనుగోలు చేయాలి. మీరిచ్చిన హామీలు అమలు చేసేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. కర్ణాటక రాష్ట్రం కేంద్రం నుండి మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం (Intervention scheme) క్రింద కిలో రూ.16లు చొప్పున 2లక్షల 50 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు. కేంద్రంలో మీకున్న పలుకుబడి ఉపయోగించి కిలో రూ.16లతో కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కనీసం 500 కోట్లు నిధులు రాబట్టి కర్నాటకలో మాదిరి మామిడి రైతులను ఆదుకోవాలని కోరుచున్నాను.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని పరిశ్రమల ఖాతాల్లో కాకుండా నేరుగా రైతులకు ప్రత్యక్షంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో మామిడి పంటకు ప్రధాన కేంద్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా. సుమారు లక్ష ఎకరాల వరకు రైతులు తోతాపురి రకం సాగు చేస్తున్న విషయం మీకు తెలుసు. ప్రత్యేకించి తోతాపురి (బెంగళూరు) రకం మామిడి పండిస్తున్న రైతులు గత నాలుగు సంవత్సరాలుగా నష్టంలో ఉన్నారు. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించడం వల్ల మామిడి పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. మామిడి ఉత్పత్తి పెరగటంతో మామిడి కొనుగోలు ధర కిలో రూ. 23లకే పరిమితం చేసి మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులు సిండికేట్గా ఏర్పడి మామిడి రైతులను దోపిడీ చేసేందుకు పూనుకున్నారన్నారు .

మామిడి రైతుల కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన ప్రధాన చర్యలు?

Read hindi news: hindi.vaartha.com

Read also: Tirumala: అభిప్రాయసేకరణతో తిరుమలలో మెరుగైన సేవలు

AP Mango Crisis Breaking News CPM Andhra Pradesh CPM Demands Support latest news Mango Farmers Issues mango price Telugu News V Srinivasa Rao

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.