📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

News Telugu: Uttam Kumar Reddy: ఏపీ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ

Author Icon By Rajitha
Updated: December 14, 2025 • 11:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం (POLAVARAM PROJECT) ,నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు ముందుకు సాగకుండా కేంద్ర జల సంఘం (CWC) సహా సంబంధిత సంస్థలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి కార్యదర్శి వి.ఎల్.కాంతారావుకు లేఖ రాశారు. వరద నీటిపై ఆధారపడిన ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నీటి హక్కులకు భంగం కలిగే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించింది.

Read also: Bandi Sanjay : కాంగ్రెస్, BRS సర్పంచులు BJPలో చేరాలని బండి సంజయ్ పిలుపు

Telangana will approach the Supreme Court over the AP

సమ్మక్కసాగర్ డీపీఆర్‌కు తుది అనుమతులు ఇవ్వాలని

ఏపీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూనే, తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న కీలక సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మైనర్ ఇరిగేషన్ కింద ఆదా చేసిన 45 టీఎంసీల నీటితో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు తొలి దశకు అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. అలాగే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు కోసం చేపడుతున్న భూసేకరణను నిలిపివేయాలని, సమ్మక్కసాగర్ డీపీఆర్‌కు తుది అనుమతులు ఇవ్వాలని కోరింది. ప్రాణహిత చేవెళ్ల, సీతారామ, ముక్తేశ్వర్ వంటి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన కింద ఆర్థిక సహాయం అందించాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విన్నవించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news telangana government Telugu News uttam kumar reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.