ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు
విజయవాడ : రాష్ట్రానికి 13,050 మెట్రిక్ టన్నుల యూరియా (Urea) ను కేటాయిస్తూ గురువారం కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) తెలిపారు. ఈ నెల 20వ తేదీకి గంగవరం పోర్టుకి యూరియా రాష్ట్రానికి చేరుతుందనిఅన్నారు. ఈ కేటాయింపుతో రైతులకు మరింత వెసులుబాటు లభిస్తుందని, రైతులకు ఎరువుల కొరత లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని,
రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని
రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు (Farmers) ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతి రైతు అవసరాలను, సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సమగ్ర దృష్టితో ముందుకొస్తుందని, రైతుల ఆదాయాన్ని పెంచడం, పంటలకు సరైన మార్కెటింగ్ను అందించడం కూటమిలక్ష్యమని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: