దేశాభివృద్ధిలో విద్య ప్రాధాన్యత గురించి వేరే చెప్పనక్క రలేదు. అందులో ప్రామాణికత కలిగిన ఉన్నతవిద్య ఎంతో అవసరం. అందుకే దేశవ్యాప్తంగా ౧౩౩౮ విశ్వవిద్యాలయాలుంటే అందులో 56 కేంద్ర విశ్వవిద్యాల యాలు, 416కి పైగా వివిధ రాష్ట్రప్రభుత్వ పరిధిలోగల విశ్వవిద్యాలయాలు, 130కిపైగా డీమ్డ్విశ్వవిద్యాలయాలు, 430కిపైగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, ఇంకా పలు జాతీయ, రాష్ట్ర విద్యాసంస్థలు నెలకొనగా అందులో 43 మిలియన్ విద్యా ర్థులు ఉన్నతవిద్యను అభ్యసిస్తున్నారు. ఒక విశ్వవిద్యాలయం పరిపూర్ణంగా పనిచేయాలంటే దానికి యూనివర్సిటీగ్రాంట్స్ కమిషన్ నుంచి వచ్చేనిధులు, ప్రభు త్వ నిధులు సకాలంలో అందాలి. అధ్యాపక అధ్యాపకే తర సిబ్బంది, ప్రయోగ వసతులు పూర్తిస్థాయిలో ఉండాలి. వీటితోపాటు విద్యార్థులకు తమ విద్యనభ్యసించుటలో భాగంగాఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సకా లంలో స్కాలర్షిప్స్ ఫెలోషిప్లు అందాలి. అందులో భాగంగానే దేశవ్యాప్తంగానున్న విశ్వ విద్యాలయాలల్లో ఖాళీగానున్న ఆచార్య, సహాచార్య కాలు వులభర్తీ ప్రక్రియను మొదలు పెట్టి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని యూని వర్సిటీ గ్రాంట్ కమిషన్ కోరి సంవత్సరాలు గడిచిపోతున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిపోయింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 2013లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేపడితే, ఆ తర్వాత 2014లో తెలంగాణ నూత నంగా రాష్ట్రంగా సిద్ధించాక ఏర్పడిన బిఆర్ఎస్ ప్రభుత్వం 2018లో యూనివర్సిటీ కొలువుల రిక్రూట్మెంట్కు సంబం ధించి1061 పోస్టుల భర్తీకి అనుమతినిస్తే, అప్పటి గవర్నర్ దానిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపితేపెండింగ్లోకి పడిపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు యూనివర్సిటీ (University)కొలువుల నోటిఫికేషనన్ను నోచుకోలేని పరిస్థితి దాపురిం చింది. కొలువులొస్తాయనే కోటి ఆశలతో విద్యార్థులు ఉద్య మంలో పాల్గొని సాధిస్తే ముమ్మాటికీ వారిఆశలు నిరాశలే అయ్యాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కరలేదు.
Read Also : http://FreeTrade Agreements: 38 దేశాలతో కీలక వాణిజ్య ఒప్పందాలు
నిరుద్యోగులపాలిట శాపం
రాష్ట్రంలో అభివృద్ధికని చెప్పుకునే ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన, ఎంత పేరు ప్రఖ్యాతులు గావించిన, నియామకాల విషయంలో మాత్రం నిరుద్యోగులపాలిట శాపంగానే మారిపోయిందని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోనున్న 11 యూనివర్సిటీలలో భోదనసిబ్బందికి సంబంధించి 2878 పోస్టులుంటే అందులో కేవలం 753 రెగ్యులర్ సిబ్బంది పనిచేస్తున్నారు. అంటే 2125 పోస్టులు (74శాతం) ఖాళీగా ఉన్నాయి. పరిశోధక విద్యార్థులకు గైడ్గా కొనసాగాలన్నా, నాణ్యమైన పరిశోధకపత్రాలను సమర్పించాలన్నా, కేంద్రం నుండి ప్రాజెక్టులు నిధులు రావాలన్న ప్రొఫెసర్ల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కానీ అన్నీ యూనివర్సిటీలలో చాలా డిపార్ట్మెంట్లలో ఒక్క రెగ్యులర్ ప్రొఫెసర్ లేకపోవ డం శోచనీయం. రాష్ట్రంలో అన్నీ యూనివర్సిటీలలో కలిపి ౩౯౩ ప్రొఫెసర్లకు 212 ఖాళీలు, 913 అసోసియేట్ ప్రొఫెస ర్లకు 792 ఖాళీలు, 1572 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 1114 ఖాళీలున్నాయంటే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉన్నదో ” అర్థమవుతుంది. పదివేలమంది విద్యార్థులున్న ఆర్జీయుకేటిలో 146 సాంక్షన్ పోస్టులుంటే 19 మంది మాత్రమే రెగ్యులర్ సిబ్బంది పనిచేయడం విడ్డూరమైతే, అందులో సైతం కొంద రు సెలవులలో ఉండటం గమనార్హం. ఇంచుమించు మిగతా యూనివర్సిటీలలో కూడా అదేతంతు కొనసాగుతుండడం చూస్తుంటే గత దశాబ్దన్నర కాలంగా యూనివర్సిటీలలో (University)చదివే విద్యార్థులకు ఎలాంటి విద్యను అందిస్తున్నామో అవగతమవుతుంది.
ఇది పెద్దసమస్య కానే కాదు
ప్రత్యేకంగా యూనివర్సిటీలలో ఆచార్య కొలువులకు అర్హతలెలా ఉండాలో గతంలోనే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆచార్య ఘంటా చక్రపాణి నేతృత్వంలో నియమించిన కమిటీ పరిశోధించి నివేదికను రచించి అందులో అర్హతలకుసంబంధించి డాక్టర్ అఫ్ ఫిలాసఫీ పూర్తిచేయాలి లేదా నెట్, సెట్, జేఆర్ ఎఫ్ క్వాలిఫైడ్ అయ్యివుండి, అకాడమిక్ రికార్డ్, రీసెర్చ్ పెరఫార్మెన్స్, టీచింగ్ స్కిల్స్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా నియమించాలని నివేదికను ప్రభుత్వానికి అందించడం జరిగింది. కానీ కాంట్రాక్ట్ సిబ్బంది తమకు న్యాయం చేయాలనే డిమాండ్ ను తెరమీదకు తేవడంతో నియామకాలు చేపట్టకుండా ఆపి వేయశారు. దాదాపు ఈ అర్హతలు సాధించాలంటే 30 నుండి 40 సంవత్సరాలు వయసు పడుతుంది. ఇలాంటి పోస్టులను గతంలో భర్తీచేసి దశాబ్దన్నరకాలం గడిచిన మరల అంతటి అదృష్టాన్ని నోచుకోలేకపోయిందని చెప్పవచ్చు. అంటే అభ్య ర్థులకు వారికి పదవీవిరమణ వయసువచ్చిన
ఆశ్చర్యపోనక్కరలేదు. ప్రభుత్వాలు తలుచుకుంటే ఇది పెద్దసమస్య కానే కాదు. కానీ కారణాలు మాత్రం సగటు మనిషికి ఒకింత అనుమానాన్ని కలిగిస్తాయని చెప్పవచ్చు. మొదట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొలువుల భర్తీచేస్తే తెలంగాణ ప్రాంతంవారికీ అన్యాయం జరుగుతుందని భావించి, ప్రతివిద్యార్థి ఉద్య మంలో పాల్గొని, తెలంగాణ ఆవిర్భావంలో విద్యార్థులు, నిరుద్యోగులు కీలకపాత్ర పోషించారని యావత్తు ప్రపంచానికి జగమెరిగిన నగ్నసత్యమే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ముందుగా యూనివర్సిటీలకు శాశ్విత వైస్ ఛాన్స లర్ లేమితో రోస్టర్ సిస్టమ్ను త్వరగా చేయడానికి కుదర లేదని తర్వాత కొంతకాలానికి అన్నీ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లను నియమించి, యూనివర్సిటీలు సక్రమంగా నడవడానికి కృషిచేస్తున్నట్లు, రేపోమాపో భర్తీప్రక్రియ పూర్తవు తుందన్నట్లు దినపత్రికల్లో ప్రకటనలు కాస్తా ఎదురుచూసే అర్హులకు భరోసా ఇచ్చినట్లు కనిపించాయి. కానీ సాంకేతిక పరమైన కారణాలతో ఖాళీల భర్తీకి నోచుకోలేదు. చూస్తుండ గానే రెండుసంవత్సరాల వీసీల పదవీకాలం ముగిసి, కొంత కాలం మరల ఇంచార్జ్ ఐఏఎస్ ఆఫీసర్లతో నెట్టుకొచ్చారు. డెంగ్యులర్ ఉపకులపతులున్నప్పుడే సాధ్యపడని పనులు, ఇం చార్జి పాలనలో పనివత్తిడి కారణంగా సరైనదృష్టి కేంద్రీ కరించలేకపోయరన్నారు. చూస్తుండగానే రెండు పర్యాయాలు బిఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగించింది. రాష్ర్టలో కాంగ్రేస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపకులపతుల నియామ కం చేపట్టింది. మరల వారి పదవులు ముగిసే సమయం ఆసన్నమవుతున్నా కాలయాపనే జరుగుతుంది.
-డా. పోలం సైదులు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: