📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : United Nations : ప్రమాదంలో ఐక్యరాజ్యసమితి అస్తిత్వం

Author Icon By Sudha
Updated: October 24, 2025 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ యుద్ధాల వలన నెల కొంటున్న అశాంతిని రూపు మాపి, ప్రపంచంలో శాంతిని నెల కొల్పి, ప్రజల ప్రాణాలను కాపాడి వారిని భయం నుండి భద్రత వైపు నడిపించి, ప్రజల మధ్య సామరస్యా న్ని నెలకొల్పడానికి, 1945 అక్టోబర్ 24వ తేదీన 51 సభ్యదేశాల చేరికతో ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఆవి ర్భవించింది. ఇంతింతై వటుడింతై… మాదిరిగా ఐక్యరాజ్య సమితి (United Nations)లో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య 193కి పెరిగింది. మొదటి మహా సంగ్రామంలో సుమారు 40 మిలియన్ల మంది ప్రజలు, సైనికులు మృత్యువాత పడ్డారు. 1939-45 సంవత్సరాల మధ్య ఆరు సంవత్సరాల పాటు అక్షరాజ్యా లు, మిత్ర రాజ్యాల మధ్య సుదీర్ఘంగా కొనసాగిన రెండవ మహా ప్రపంచ సంగ్రామం చరిత్రలో భయంకరమైన మార ణహోమానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. సైనికులు ప్రజల తో సహా సుమారు 70మిలియన్ల మందికిపైగా ఈ యుద్ధం లో మరణించినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ మహా యుద్ధ ప్రళయాన్ని నిలువరించడంలో అప్పటి నానాజాతి “సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) ఘోరమైన వైఫల్యాన్ని మూట గట్టుకుంది. లీగ్ ఆఫ్ నేషన్స్క ప్రత్యామ్నాయ అంతర్జాతీయ వేదికగా ఐక్యరాజ్య సమితి (United Nations)ఆవిర్భవించింది. అయితే ఐక్యరాజ్య సమితికూడా లీగ్ ఆఫ్ నేషన్స్ దారిలోనే పయ నిస్తూ, తన మనుగడను కోల్పోయి, అదృశ్యమయ్యే ప్రమా దం పొంచి ఉంది. ప్రపంచ జనాభా 8.2 బిలియన్లకు చేరింది.

Read Also: Trump: కెనడాతో అమెరికా వాణిజ్య చర్చలు రద్దు: ట్రంప్

United Nations

ఆర్థిక మందగమనం

కొన్ని దేశాలు జనాభా సమస్యతో దేశాలుజనాభాతీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరికొన్ని దేశాల్లో జన సంఖ్య తగ్గి, యువ తరం లేక అనేక ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని దేశాలు ఆర్థిక మందగమనంతో ప్రజల అవసరాలు తీర్చలేక సతమ తమవుతున్నాయి. కోవిడ్ సంక్షోభం వలన ఆర్థికంగా అనేక దేశాలు అస్తవ్యస్త పరిస్థితులను చవిచూసాయి. కోవిడ తర్వాత రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియదు. అలాస్కాలోట్రంప్, పుతిన్ మధ్య జరిగిన శాంతి చర్చలు అసంపూర్తిగా ముగియడంతో మరో దఫా చర్చలు బుడా పెస్ట్లో జరగబోతున్నాయి. ఉక్రెయిన్ డొనెట్స్ ప్రాంతాన్ని వదిలేస్తే, యుద్ధాన్ని ఆపేస్తానని రష్యా అధ్యక్షుడు పుతిన్ షరతు పెట్టడం జరిగింది. ఇప్పటికే డొనెట్స్ లోని 75 శాతం భూభాగం రష్యా అధీనంలో ఉంది. తన షరతును ఉక్రెయిన్ అంగీకరిస్తే, తన అధీనంలోని కొన్ని భూభాగాల ను ఉక్రెయిన్క అప్పగిస్తానని పుతిన్ ట్రంప్తో జరిపినటెలి ఫోన్ సంభాషణ సమయంలో పేర్కొనడం జరిగింది. పుతిన్ షరతును జెలెన్స్ స్కీ తిరస్కరించినట్టు, ట్రంప్ మౌనం వహించినట్టు వార్తా కథనాలు వెలువడ్డాయి. ఇలాంటి పరి స్థితుల నేపథ్యంలో ట్రంప్ పుతిన్ల మధ్య జరగబోయే ముఖాముఖి చర్చలు ఎలాంటి ఫలితాలనిస్తాయో ఊహించ డం కష్టం.

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం

సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వలన అనేక విపత్కర పరిణామాలు చోటుచేసుకుం టున్నాయి. రష్యా వద్ద చమురు దిగుమతి చేసుకుంటున్న కారణంగా భారత్పై ట్రంప్ట్రేడ్ వార్, వీసా నిబంధలు, నిర్బంధాలు కొనసాగిస్తున్నారు. చైనా, అమెరికాల మధ్య టారిఫ్ల గోల పతాక స్థాయికి చేరింది. ఏడు యుద్ధాలను ఆపానంటున్న ట్రంప్కు శాంతిబహుమతి దక్కలేదు. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య శాంతియుత వాతావరణం నెలకొన్నా, ఈ దేశాల మధ్య ఎప్పుడైనా అగ్గి రాజుకునే అవకాశం లేదు. హమాస్ లక్ష్యంగా గాజాలో కొనసాగుతున్న రక్తపాతానికి స్వస్తిచెప్పడానికి ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్ అంగీ కారం తెలపడం ముదావహం. భారత్ చేతిలో చావుదెబ్బ తిన్న పాక్ తన వక్రబుద్ధి విడనాడడం లేదు. భారతన్ను ఏదో చేయాలనే పైశాచిక ధోరణితో పాక్ నేల విడిచి సాము చేస్తున్నది. పాకిస్థాన్లోని బలూచిస్తాన్, సింధ్, పాక్ ఆక్ర మిత కాశ్మీర్ ప్రాంతాలు భగ్గమంటున్నాయి. వేరు కుంపటి పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. పులిమీద పుట్రలా అఫ్ఘా నిస్థాన్ పాక్కు ముచ్చెమటలు పట్టిస్తున్నది. పాక్ కు ఇస్లామిక్ దేశాలు కూడా సంఘీభావం తెలపడం లేదు. అఫ్ఘానిస్థాన్ దాడులతో పాక్ భీతిల్లుతున్నది. స్వంత ఇంటిని చకదిద్దుకో లేని పాక్ అమెరికా చెంత పదాక్రాంతమయింది. నేపాల్లో ఇటీవల చోటుచేసుకున్న జన్జడ్ ఉద్యమం ప్రపంచదేశాలకు ఒక హెచ్చరిక వంటిది. బంగ్లాదేశ్లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయి.

United Nations

యుద్ధ మేఘాలు

ప్రపంచంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటు న్నాయి. ఈజిప్టు ఇథియోపియా, థాయ్లాండ్ కంబోడియా, భారత్ పాక్, ఇజ్రాయిల్ ఇరాన్, ఇజ్రాయిల్ పాలస్తీనా, రు వాండా కాంగో, అజర్ బైజాన్ ఆర్మీనియా తదితర యుద్ధా లను తానే ఆపానంటూ ట్రంప్ పదే పదే వల్లె వేస్తున్నా, ఆయా దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాలు కేవలం తాత్కాలికమే. ప్రస్తుతం కాల్పుల విరమణ పేరుతోనే, ట్రంప్ బెదిరింపుల వలనో వివిధ దేశాల మధ్య సంఘర్షణలు తాత్కాలికంగానే సర్దుమణిగాయి. భవిష్యత్తులో ఏం జరుగు తుందో ఊహించలేం. ప్రపంచంలో అశాంతి రాజ్య మేలుతు న్నది. ప్రపంచంలోని పలుదేశాల మధ్య ఆధిపత్య భావజాలంతో, ఇతర దేశాల భూభాగాలను, సహజ సంపదను కబ ళించాలనే దుగ్ధతో, అత్యాశతో యుద్ధాలు జరుగుతున్నాయి. భారత్లాంటి దేశాలను ఆర్థికంగా ఎదగకుండా చేయడానికి అగ్రదేశాలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. పాక్ లాంటి దేశాలు ఆర్థికంగా చితికిపోయినా ఉగ్రవాదులకు స్వర్గధామం గా నిలుస్తున్నాయి. మయన్మార్, వెనిజులా వంటి దేశాల్లో ప్రజలకు స్వేచ్ఛలేదు. కొన్ని దేశాలు నియంతృత్వపు పోకడ లు కొనసాగిస్తున్నాయి. అగ్రదేశాలు పడగ నీడలో కొన్ని దేశా లు మొద్దునిద్దుర పోతుంటే, మరికొన్ని దేశాలు ఐ.ఎం.ఎఫ్, వరల్డ్ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థల సహాయంతో తమతమ దేశాల ఆర్థిక అవసరాలను తీర్చడంలో తాత్కాలికంగా నెట్టు కొస్తున్నాయి. వీటో అధికార దర్పంతో అగ్రరాజ్యాలు చెల రేగిపోతున్నాయి. భద్రతామండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం అందని ద్రాక్షలా మారింది. ప్రపంచ శాంతిని కాపాడడంలోను, యుద్ధాలను నివారించడంలోను ఐక్యరాజ్య సమితి ఘోరంగా వైఫల్యం చెందింది. ఐక్యరాజ్య సమితి ఒక అవశేష అవయంగా, ఆరో వేలిలా రూపాంతరం చెందింది. ఏ లక్ష్య సాధన కోసం ఐక్యరాజ్య సమితి అవతరిం చిందో, ఆ లక్ష్యాల సాధనలో విఫలం కావడం దురదృష్ట కరం. పేద దేశాల పక్షాన, యుద్దపీడిత దేశాల పక్షాన నిల బడవలసిన ఐక్యరాజ్య సమితి కేవలం ధనిక దేశాలకు వంత పాడే పరిస్థితి తలెత్తడం సముచితం కాదు.

నిర్వీర్యమైన ఐక్యరాజ్య సమితి

ఏడు దశాబ్దాలకు పైగా భారత్ పొరుగునున్న పాక్ ప్రేరిత ఉగ్రవాద చర్యలతో విసుగెత్తిపోతుంటే, ఇప్పటి వరకు ఐ. రా. స ఒరగబెట్టిం దేమీ లేదు. అదే అగ్రదేశాలు ఇతర దేశాలపై దాడి చేస్తుంటే, ఆ దేశాల ఆదేశాలకు, వారి అడుగులకు మడుగులొత్తడం విచిత్రం. గాజాలో రక్తపాతం ఐక్యరాజ్య సమితికి కనిపించ లేదా? బలూచిస్తాన్, సింధ్, పి.ఓ.కె ప్రజలు పాక్ నుండి స్వేచ్చ కోసం తపించడం ఐ.రా.స దృష్టికి రాలేదా? ఉక్రె యిన్ రష్యా యుద్ధంలో అమాయక ప్రజలు చనిపోతుంటే, ఆ దృశ్యం ఐ.రా.స కంటికి కనిపించలేదా? అన్ని దేశాల ప్రజలు యుద్ధాలను నిరసిస్తున్నారు. తినడానికి తిండిలేక,ఉపాధి అవకాశాలు లేక, తీవ్రమైన ఆర్థిక అంతరాల మధ్య అవినీతి, దరిద్రం వంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో జీవిస్తూ, ఆకలి కేకలతో అలమటిస్తున్న సామాన్య ప్రజల గోడు పై గొడ్డలి పోటులా యుద్ధాలు పరిణమించాయి. ధనిక దేశాల ఆగడాలను నిలువరించలేక, అడకత్తెరలో పోకచెక్కలా నలిగి పోతూ, కొన్నిదేశాలు మౌనముద్ర వహిస్తూ, తటస్థంగా మను గడ సాగిస్తున్నాయి. ఎంతో విసతమైన యంత్రాంగం కలిగి ఉండి, ప్రపంచ శాంతిసాధన కోసం ఏర్పడిన అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి నిర్వీర్యమైపోయింది. ఐక్యరాజ్య సమితి యుద్ధాలను నివారించడంలో వైఫల్యం చెందిందని డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలోనే తీవ్రమైన విమర్శ చేయడం జరిగింది. శాంతి స్థాపనలో ఘోర వైఫల్యం చెందిన ఐక్యరాజ్య సమితి మనుగడ ఇకప్రశ్నార్థకమే. ఐ.రా.స మరో నానా జాతి సమితి (లీగ్ ఆఫ్ నేషన్స్) లా మిగిలిపోయే అవకాశముంది. యుద్ధాలను నివారించడానికి, ప్రపంచంలో శాంతిని స్థాపించడానికి ఇతర దేశాల కలిమిపై, బలిమిపై, ఆదేశాలపై ఆధారపడని శక్తివంతమైన మరో అంతర్జాతీయ వేదిక నిర్మించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

-సుంకపల్లి సత్తిరాజు

UNలో ఎన్ని దేశాలు ఉన్నాయి?

ఐక్యరాజ్యసమితిలో 193 సభ్య దేశాలు ఉన్నాయి. ఇటీవల చేరిన సభ్యుడు దక్షిణ సూడాన్, 2011లో 193వ రాష్ట్రంగా అవతరించింది.

ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది?

ప్రపంచంలోని అతిపెద్ద దేశాలు మరియు డిపెండెన్సీల జాబితా …రష్యా మొత్తం వైశాల్యం 6,592,850 చదరపు మైళ్ళు (17,075,400 చదరపు కి.మీ), రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News Diplomacy global-politics international-relations latest news Telugu News UN United-Nations world-affairs

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.