📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు టెన్త్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు అమరావతికి త్వరలోనే అధికారిక గుర్తింపు.. చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం.. జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

Latest Telugu News : Friendship : అపూర్వ ‘అణు’బంధం’!

Author Icon By Sudha
Updated: December 9, 2025 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ రష్యాల స్నేహం విడదీయలేనిదని, ఎల్ల ప్పుడూ ధ్రువతారలా వెలుగులీనుతూనే ఉం టుందని మరోసారి వెల్లడైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా అదే విషయాన్ని నొక్కి చెప్పారు. నిజానికి ఈ రెండు దేశాల మధ్య స్నేహబంధం (Friendship)ఈనాటిది కాదు. భారత స్వాతంత్య్రానంతరం దేశ పారిశ్రామిక ప్రగ తికి సాంకేతికతను అందించిన దేశంగా రష్యా పట్లభారతీ యులందరికీ కృతజ్ఞత ఉంది. అదే ఇప్పుడు తాజాగా రెండు దేశాల పాలనాధ్యక్షుల మధ్య భేటీకి దారులు తెరచింది. భారతీయ సంప్రదాయాలను, రుచులను విదేశీ అతిధులకు పరిచయం చేయడంలో మనదేశం ఎప్పుడూ ముందుంటుంది. భారతీయతను చాటి చెప్పిన తర్వాతనే అవతలి వారితో ఒప్పందమైనా, స్నేహశీలతను ప్రకటించడమైనా. భారత్ పై అమెరికా ప్రతీకార సుంకాలు, ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇరు దేశాలు తమ ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యాన్ని బలపరచుకునేందుకు ఈ భేటీ బాగా ఉపయోగ పడింది. ప్రధానంగా ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు భారత రష్యాలు కలిసి పని చేస్తాయి. వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పది వేలకోట్ల డాలర్లకు పెంచింది. విశేషంగా ఉక్రెయిన్తో యుద్ధానికి శాంతియుతంగా ముగింపు పలకాలంటూ ప్రధాని మోడీ పుతిన్ ను వేడు కోవడం ఇతర దేశాలతో సంబంధాలు ఎలా ఉండాలో ప్రత్యేకించి చెప్పినట్లయింది. భారత్ రష్యా బిజినెస్ ఫోరంలో మోడీ, పుతిన్ లు పాల్గోవడం భారత్ సుస్థిరా భివృద్ధికి రష్యా బాసటగా ఉంటుందని పుతిన్ భరోసా ఇవ్వడం చెప్పుకోదగిన సందర్భం. సుదీర్ఘ కాలంగా రష్యా, భారత్ సంబంధాలు (Friendship)సజావుగా కొనసాగడానికి డోకా లేనివిధంగా అడుగులు పడ్డాయి. గత 8దశాబ్దాల్లో మానవాళి అనేక సవాళ్లు సంక్షోభాలను ఎదుర్కొంది. వాటన్నింటినీ తట్టుకుంటూ భారత్ రష్యా మైత్రి ధ్రువ తారలా నిలిచిందన్న భావనల బలిమి కలిగింది. పరస్పర గౌరవం, బలమైన విశ్వాసం, అనే పునాదులపై ఈ బంధం శాశ్వతమైనదని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉద్ఘాటించడంతో ఆయన రెండురోజుల భారత పర్యటన ముగిసింది. అందువల్ల దైపాక్షిక సంబంధాలతోపాటు ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలూ మరింత బల పడతాయని ఆయన ఆకాంక్షించారు. పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో శుక్రవా రం జరిపిన శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం 16 కీలక ఒప్పందాలు కుదిరాయి. నైపుణ్య కార్మికుల వలసలకు రష్యా వెసులుబాటునిచ్చింది. భారత కూడా అదే స్ఫూర్తితో స్వాగతం పలికింది. ఆరోగ్యం, ఆహార భద్రత, శాస్త్రీయ పరిశోధనలు, నౌకాయానం, ఎరువులు, విద్య వంటి రంగాల్లో పరస్పర సహకారం పెంపునకు దోహదపడే అంశాలే ఉన్నాయి. వాణిజ్య లోటును పూడ్చుకోవడంలో మాస్కో ఢిల్లీకి సాయపడనున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఐలోపేతం చేసుకోవడంపై చర్చించారు. భారత్, రష్యాల మధ్య ప్రస్తు తం ఏటా 64 బిలియన్ల డాలర్ల వాణిజ్యం జరుగుతుండ గా 100 బిలియన్ డాలర్లకు పెంచుతూ రష్యన్ అధ్య క్షుడు పుతిన్ ప్రకటించారు. భారత్ ఇంధన అవసరాలను తామే పూర్తిగా తీర్చగలమని భరోసా దొరికింది. చము రుగా, గ్యాస్, బొగ్గు విషయంలో కూడా ఇదే పద్ధతి అనుసరించేందుకు రష్యా ముందుకొచ్చింది. భారత్ ఉత్ప త్తుల కోసం రసాయన మార్కెట్లను నిరంతరం అందుబా టులో ఉంచేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. వ్యవ సాయం, ఔషధ రంగంలో కీలకమైన అణు టెక్నాలజీ వాడుకునేందుకు భారతకు పూర్తి స్థాయిలో సహకరించను న్నామని, ఆ మేరకు ఒప్పందం కూడా జరిగింది. భారత్, రష్యా మధ్య మానవ వనరుల రాకపోకలను సులభతరం చేసేలా రెండు ఒప్పందాలు కుదుర్చు కున్నట్లు తెలిపారు. ఇరుదేశాలు కలిసి ఐక్యంగా సాగుదామన్న పుతిన్ ఆలోచ నకు భారతీయుల్లో విశేషఖ్యాతి లభించింది. గురువారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న పుతిన్కు ప్రధాని మోడ్స్ స్వయంగా ఎయిర్పోర్టుకు వెళ్లి స్వాగతం పలికినవిషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం పుతిన్కు రారక్షణ,ఇంధ నంసహా అనేక రంగాల్లో ఇరుదేశాల సహకారాన్నిమరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్చలు సాగాయి. ఈ పర్యటన సందర్భంగా పుతిన్కు ప్రధాని మోడీ వివిధ బహుమతులు అందించారు. ఇందులో భగవద్గీత రష్యన్ ఎడిషన్, కాశ్మీరీ కుంకుమ పువ్వు, అసోం బ్లాక్, బెంగాల్ ముర్జీదాబాద్ కు చెందిన వెండి టీ సెట్, మహారాష్ట్ర హస్త కళా తయారీ వెండి గుర్రం, ఆగ్రా నుంచి తెచ్చిన మార్బుల్ చెన్ సెట్ వంటివి ఉన్నాయి. ఇలా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలకు ఆసా్కరమిచ్చే ఆయా దేశాల ప్రాముఖ్యత కలిగిన కానుకలను ఇచ్చి పుచ్చుకో వడం ఓ సాంస్కృతిక మర్యాదగా బాసిల్లుతుంది. భారత్, రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాలన్నీ ఐదేళ్ల పాటు ఉండే ఆర్థిక ఒప్పందాలు ‘పంచవర్ష ప్రణాళిక’గా చెప్పాలి. తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని, ప్లాంట్ నిర్మాణాలను త్వరలో వినియోగంలోకి తెచ్చేందుకు రష్యా హామీ ఇచ్చింది. భారత్ ప్రగతికి కాలొడ్డిన అమెరికా ప్రస్తావించిన అన్ని అంశాలకూ రష్యా భరోసా లభించడం ఆహ్వానించదగిన పరిణామం. రష్యాతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు వద్దన్న అమెరికాను కానీ యూరప్ ఒత్తిళ్లకు గానీ లొంగని భారతీయ పాకుల వైఖరి ప్రశంస నీయం. భారత్, రష్యాల మధ్య బంధం అత్యంత వ్యూహాత్మకమైనదని, వారి భేటీ ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపినట్లుగా చైనా అభివర్ణించింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

BreakingNews Emotional Bond FRIENDS friendship latest news Strong Relationship Telugu News Unique Bond

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.