Ram Mohan Naidu: చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని పూతలపట్టు నియోజకవర్గంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు. తవణంపల్లి మండలం, దిగువమాఘం గ్రామంలోని మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి నివాసానికి విచ్చేసిన ఆయనను చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గుమళ్ళ ప్రసాదరావు మర్యాదపూర్వకంగా కలిశారు.
Read Also: Laddu Controversy : రాష్ట్రంలో లడ్డూ తప్ప ఇంకే సమస్య లేదా ? – అంబటి రాంబాబు
ఆత్మీయ ఆలింగనం.. సాదర స్వాగతం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, “వెల్కమ్ టు చిత్తూర్” అంటూ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించుకున్నారు.
Ram Mohan Naidu: ముఖ్య నేతల సమక్షంలో..
ఈ మర్యాదపూర్వక భేటీలో ఎంపీతో పాటు మాజీ ఎంపీ గల్లా జయదేవ్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, చూడ (CHUDA) ఛైర్‌పర్సన్ శ్రీమతి కఠారి హేమలత తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాకతో దిగువమాఘం గ్రామంలో కోలాహలం నెలకొంది.
hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: