📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

Latest Telugu News : unemployed : నిరుద్యోగులకు ఏదీ ఉపాధి గ్యారంటీ?

Author Icon By Sudha
Updated: November 14, 2025 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్నో దశబ్దాలుగా ఈ ప్రాంత నిరుద్యోగుల ఆశలు అ డి యాశలు అయ్యాయి. చేసిన బలిదానాలకు అర్థం లేకుండా పోయింది. ప్రారంభించిన ఉద్యమాలు, ఆత్మర్ప నాలు అన్ని వృధా ప్రయాసే అనే నిరాశలో, నిరుత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో వున్న నిరుద్యోగులు ఒక రకమైన మానసిక సంఘర్షణ చేస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దశాబ్దాలుగా ఉద్యోగాలకోసం ఈ ప్రాంత నిరుద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాల ను ఎలిగేత్తిచాటారు. ఇక విసుగు చెంది స్వరాష్ట్రంలోనే తమ ఆకాంక్షలు నెరవేరుతాయని 1969లో తొలి తెలంగాణ ఉద్యమం నడిపి విద్యార్థులు అమరులు అయ్యారు. ఆ తర్వాత కూడా ఈ ప్రాంత విద్యార్థి, నిరుద్యోగులకు (unemployed) నష్టం జరగడాన్ని తట్టుకోలేక మలిదశ తెలంగాణ ఉద్యమంలో 1200మంది ఆత్మార్పణ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు ఆకాంక్షను దేశానికి అర్థం అయ్యేలా చేశారు. ఇది చరిత్ర. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 2014 అయ్యాక కూడా నిరుద్యోగులు, విద్యార్థుల ఆకాంక్షలు ఆవిరై ఒక తరం భవిష్యత్తు నాశనం అయింది. వేసిన ఉద్యోగ ప్రకటనలు అయితే కోర్టు మెట్లు ఎక్కడంతోనే మొదటి దఫా ప్రభుత్వం పనితనం అయింది. రెండో దఫా ప్రభుత్వం ఉద్యోగ ప్రక టనలు లీకేజీలతో గడిచింది. దీనితో విసుగు చెందిన నిరుద్యోగ, (unemployed) విద్యార్థి యువకులు మొన్న జరిగిన ఎన్నికలలో నూతన ప్రభుత్వం కోసం గత ప్రభుత్వాన్ని తిరస్కరించారు. ఇప్పుటి ప్రభుత్వం గతంలో జరిగిన పొరబాట్లు జరగ కుండా మొదటగా టిఎస్పిఎస్సి బోర్డ్ను ప్రక్షాళన చేశారు. ఇంకా టిఎస్ పిఎస్ ఖాళీగా వున్న ఉద్యోగాలను మొదట గా భర్తీ చేసిన తర్వాతే ఉద్యోగ ప్రకటనలు జారీచేయాలని అనుకున్నారు. వేసే ఉద్యోగ ప్రకటనలు కోర్టు మెట్లు ఎక్క కుండా జాగ్రత్త తీసుకోవాలి అని, ఉద్యోగ క్యాలెండర్ మాని ఫెస్టోలో చేర్చారు. నోటిఫికేషన్ వచ్చాక మాత్రం ఒక సంవ త్సరంలో పూర్తి అయ్యేలా జవాబుదారీ తనంతో, పారదర్శ కతతో చేస్తారని ఎదురుచూస్తున్నారు. వివిధ ఉద్యోగ ప్రకట నలకు అర్హత వున్న అందరూ ఎగ్జామ్ రాసేలా సమయాన్ని ఇచ్చేలా ప్రణాళికతో నిర్వహించాలి. కానీ జరింగింది, జరు తుంది చూస్తుంటే నిరుద్యోగులకు అన్యాయం ఇప్పటికీ జరుగుతుంది అని తెలుస్తుంది.

Read Also : http://Bihar Election Results: ముందంజలో స్టార్ సింగర్

unemployed

అసలు సమస్య

గ్రూప్ 2ఎగ్జామ్ ను పోస్ట్లు పెంచకుండా పరీక్ష నిర్వహించి వేశారు. గ్రూప్ 3 పోస్ట్లను కూడా పెంచలేదు. గ్రూప్ 1 పరీక్షపై అనేక నీలి నీడలు వున్నాయి. దాదాపు 20 రకాల కేసులు హై కోర్టు లో పెండింగ్లో వున్నాయి. కానీ కోర్టుకి అఫిడవిట్ వేయ డం టీజిపిఎస్ కి రాలేదు. అసలు సమస్య జి.ఓ. నెంబర్ 55ను తీసి వేసి జి.ఒ. నంబర్ 29ను తీసుకొచ్చి రిజర్వేషన్ సూత్రానికి విరుద్ధంగా ప్రిలిమ్స్ లో పాస్ అయిన అభ్యర్థుల ను మెయిన్స్క ఎంపిక చేశారు. ప్రిలిమ్స్ పరీక్షలో క్వశ్చన్ లకు జవాబులు తప్పుగా ఇచ్చారని అభ్యర్థులు కమిషన్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా కూడా పట్టించుకోకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవహరించింది. ఇలా చేసే అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఎపిపిఎస్సి 2011లో ఇచ్చిన గ్రూప్ 1 రెండు సార్లు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా మెయిన్స్ ఎగ్జామ్స్ పై పలు రకాల కేసులు వేయడం వలన వాటిని విచారణ చేసిన గౌరవ హైకోర్టు తీర్పును వెలువరిస్తూ మెయిన్స్ మూల్యాంకనం మళ్లీచేయా లని అది సాధ్యం కాకపోతే మళ్లీ మెయిన్సను నిర్వహించా లని తీర్పులో తెలియజేసింది. గత ప్రభుత్వంలో రెండు సార్లు ప్రిలిమన్ను రద్దు చేశారు. ఇప్పుడు ప్రిలిమ్స్ నిర్వహిం చిన అనేక అపోహలు, అనుమానాలు, అపార్థాలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తీరని మానసిక వేదన, ఆవేదనతో ఇబ్బంది పడ్డారు. కేస్లో అన్ని కోర్టు పరిధిలో పరిష్కరించా కే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని తమ బాధను, మూగ వేదనను ఎవరికి చెప్పాలో తెలియక మానసిక క్షోభను అను భవిస్తూ మెయిన్స్ ఎగ్జామ్స్ రాశారు. ప్రభుత్వం ఒకరకంగా యుద్ధ ప్రాతిపదికన గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను పరీక్షలు నిర్వహించి, రిజల్ట్స్ ప్రకటించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చింది. కానీ గ్రూప్ 1 విషయంలో కూడా ఎగ్జామ్ నిర్వహించాలి అనుకుందే కానీ నిరుద్యోగుల పోహలను గుర్తించలేకపోయింది. ప్రభుత్వ తప్పు ఇక్కడ లేకున్నా టీ జిపిఏస్ ఏం చేస్తున్నట్టు? ఎన్ని ప్రభుత్వాలు మారిన ఎంద రు చైర్మన్లు మారిన కూడా ఈ అవకతవకలకు ముగింపు పలకలేరా? గత ప్రభుత్వం లాగే ప్రతిదీ కోర్టు మెట్లు ఎక్కితే జాబ్ క్యాలెండర్ వేసి ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారు. వీటి అని అన్నిటికీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యత వహించాలి. అనుమానాలు, అపోహలను తొలగించాల్సిన బాధ్యత రా జ్యాంగ సంస్థ అయిన పబ్లిక్ సర్వీస్ కమిషన్పై వుంది. ప్రభుత్వం కూడా తగిన చొరవ తీసుకోవాలి.

గ్యారంటీ ఇస్తే చాలు

గత ప్రభుత్వ తప్పులను ఈ ప్రభుత్వం కూడా చేస్తే ఇక నిరుద్యోగుల ఆకాంక్షలు ఎవరు తీర్చాలి? ఇంకా ఎన్ని శతాబ్దాలు ఈ అన్యాయం చూస్తూ వుండాలి? ఇప్పటికే ఒక తరానికి అన్యా యం జరిగింది. ఇంకో తరానికి అదే జరుగుతుంది. నిరు ద్యోగుల జీవితాలు గత 12 సంవత్సరాలలో తల కిందులు అయ్యాయి. నిరుద్యోగులు గ్రామ గ్రామం తిరిగి ప్రజలలో చైతన్యం కలిగించి ఈ ప్రభుత్వ ఏర్పాటులో తగు కృషి చేసిన ఈ రాష్ట్ర నిరుద్యోగులకు కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వంలో కూడా తగిన న్యాయం ఇప్పటికీ జరగట్లేదు. ఇప్పటికి అయిన ప్రభుత్వం, మేధావులు మౌనం వీడిజరు గుతున్న పొరపాట్లను సరిచేయాల్సిన తక్షణ అవసరంవుంది. అవసరం అయితే నిరుద్యోగులతో మీటింగ్ ఏర్పాటు చేసి వారి అభిప్రాయాలు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ఇవి అన్నీ జరిగేలా నిరుద్యోగుల జీవితాలలో మార్పు వచ్చే లా చేస్తారు అని యావత్తు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ యువకులుతెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆరు గ్యారం టీల లో నిరుద్యోగ భృతి అమలు చేయకున్నా, ప్రభుత్వ ఉద్యోగాల గ్యారంటీ ఇస్తే చాలు.
-ఆర్.భాస్కర్ రెడ్డి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also;

Breaking News Employment Schemes Government Programs Job Guarantee latest news Telugu News unemployment Workforce

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.