📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest News: Rail Terminals: ఏపీలో రెండు మెగా రైల్ టెర్మినళ్లు

Author Icon By Anusha
Updated: October 31, 2025 • 12:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే సదుపాయాలను మరింత విస్తరించడానికి కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని పరిధిలోని అమరావతి,గన్నవరం ప్రాంతాల్లో కొత్త రైల్వే టెర్మినల్స్ (Rail Terminals) నిర్మించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక రాబోయే సంవత్సరాల్లో రైల్వే రవాణాలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Read Also: YS Sharmila: జాతీయ విపత్తుగా గుర్తించాలి..ఎపిసిసి చీఫ్ వైఎస్ షర్మిలా

విజయవాడ (Vijayawada station) స్టేషన్‌పై భారం తగ్గించడానికి ఈ టెర్మినల్స్ ఉపయోగపడతాయి. విజయవాడ, గుంటూరు స్టేషన్లను కూడా విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అమరావతిలో 8 ప్లాట్‌ఫాంలతో ఒక పెద్ద టెర్మినల్ నిర్మించనున్నారు. ఇక్కడ రైళ్ల నిర్వహణ పనులు కూడా చేస్తారు.

గన్నవరంలో మరో టెర్మినల్ అభివృద్ధి చేయడం ద్వారా విజయవాడ స్టేషన్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ఈ విస్తరణ పనుల వల్ల విజయవాడ, గుంటూరు స్టేషన్ల మీదుగా మరిన్ని రైళ్లు నడిచే అవకాశం ఉంది.అమరావతిలో 120 రైళ్లు సులభంగా వచ్చి వెళ్లేలా ఒక కొత్త రైల్వే టెర్మినల్ (Rail Terminals) (Rail Terminals) నిర్మించనున్నారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా అమరావతిలో ప్రధాన స్టేషన్‌

రాజధాని మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 56 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ వేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా అమరావతిలో ప్రధాన స్టేషన్‌ను ఒక పెద్ద కోచింగ్ టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తారు.

Rail Terminals

కోచింగ్ టెర్మినల్ అంటే, రైళ్లు బయలుదేరే స్టేషన్ లేదా రైళ్లు ఆగిపోయే స్టేషన్. అక్కడ రైళ్ల కోచ్‌ల మెయింటెన్స్ కూడా చూసుకుంటారు. ఈ కొత్త టెర్మినల్‌లో 8 రైల్వే లైన్లు, 8 ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి.

ఈ కొత్త టెర్మినల్ అమరావతితో పాటు

ప్రతి ప్లాట్‌ఫామ్‌పై 24 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ఉండే రైళ్లు నిలబడతాయి. భవిష్యత్తులో 120 రైళ్లు వచ్చి వెళ్లేలా దీన్ని నిర్మిస్తున్నారు. రైళ్లు ఆగిపోయే కోచ్‌లను సరిచేయడానికి 6 పిట్ లైన్లు కూడా కడతారు.అందులో ఒకటి వందేభారత్ రైలు కోసం ప్రత్యేకంగా ఉంటుంది.

ఈ ప్రాజెక్టుకు మొత్తం 300 ఎకరాల స్థలం అవసరమని రైల్వేశాఖ అంచనా వేసింది. ఈ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని కోరింది. ఈ కొత్త టెర్మినల్ అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Amaravati railway terminal Andhra Pradesh railways Gannavaram terminal latest news Telugu News Vijayawada station expansion

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.