📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Latest news: Tuni: బాలిక పై అత్యాచార కేసులో నిందితుడు ఆత్మహత్య

Author Icon By Saritha
Updated: October 23, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పోలీసు కస్టడీలోనే నిందితుడు ఆత్మహత్య చెరువులో దూకి మృతి

కాకినాడ జిల్లాలోని తుని ప్రాంతంలో జరిగిన మైనర్ బాలికపై అఘాయిత్యం(Tuni) కేసులో సంచలనం చోటుచేసుకుంది. టీడీపీ(TDP) నేత తాటిక నారాయణరావు, మైనర్ బాలికపై దారుణం చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. గురువారం పోలీసు కస్టడీలో ఉన్న సమయంలోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చడానికి తీసుకెళ్తుండగా టాయిలెట్‌కు వెళ్తా అని చెప్పి వాహనం నుండి దిగిన నారాయణరావు, తుని కోమటిచెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. రాత్రంతా గజ ఈతగాళ్లు వెతికినా శవం దొరకకపోగా, ఉదయం పోలీసులు బాడీని వెలికితీశారు. నిందితుడు పశ్చాత్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని, లేక అనుకోకుండా చెరువులో పడిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

Read also: ఈరోజు బంగారం ధర: వివిధ కేరట్ల తేడాలు మరియు సరైనది ఎంచుకోవడం ఎలా

Tuni: బాలిక పై అత్యాచార కేసులో నిందితుడు ఆత్మహత్య

దారుణం వీడియోతో బహిర్గతం

తుని ఘటనలో నిందితుడు తాటిక నారాయణరావు,(Tuni) గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను తాతయ్య వరుస అవుతా అని నమ్మించి, స్కూల్ నుండి బయటకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబ సభ్యులు గురుకుల పాఠశాల ముందు ఆందోళన చేపట్టగా, కేసును ఉన్నతాధికారులతో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదంతా గమనించిన ఓ వ్యక్తి నిందితుడిని ఫాలో అవుతూ మొబైల్‌లో వీడియో తీశాడు. వీడియోలో బాలిక దుస్తులు సరిచేసుకుంటూ ఉండగా, ఆ వ్యక్తి “ఏం చేశావ్?” అని నారాయణరావును ప్రశ్నించగా, అతడు “ఏం చేస్తావో చేసుకో” అంటూ బాలికను బైక్‌పై ఎక్కించుకుని పరారయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

andhra pradesh crime Andhra Pradesh News Gurukula School kakinada Latest News in Telugu minor girl assault Tatika Narayanarao TDP leader Telugu News Tuni Case

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.