కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ప్రాణాధారంగా నిలిచిన తుంగభద్ర ప్రాజెక్టు ప్రస్తుతం తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. సాగునీరు, తాగునీటిని అందించే ఈ జలాశయానికి ఉన్న మొత్తం 33 గేట్లలో ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా సాంకేతిక లోపాలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇంజినీర్లు వెల్లడించిన వివరాల ప్రకారం ఇంకా ఏడు గేట్లు (Seven gates) పనిచేయకపోవడం వల్ల జలాశయం భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.గతేడాది ఆగస్టు 10న కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు 19వ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అప్పుడు అత్యవసర పరిస్థితుల్లో స్టాప్‌లాగ్‌లను ఏర్పాటు చేసి నీటిని నియంత్రించడం జరిగింది. ఆ ఘటన తరువాత గేట్ల స్థితి పట్ల నిపుణులు,అధ్యయనం చేసి, వచ్చే ఏడాది జూన్ నాటికి మొత్తం 33 గేట్లను పూర్తిగా మార్చాల్సిందే అని స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఒకవేళ వరదల సందర్భంలో
ఆ దిశగా గదగలో కొత్త గేట్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే నిర్మాణానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రస్తుత వర్షాకాలంలో ప్రాజెక్టు భద్రతపై అనిశ్చితి నెలకొంది.ఇంజినీర్ల నివేదిక ప్రకారం 4, 11, 18, 20, 24, 27, 28 నెంబర్ల గేట్లు పూర్తిగా పనిచేయడం మానేశాయి. ఒకవేళ వరదల సందర్భంలో (floods) ఈ గేట్లను ఎత్తే ప్రయత్నం చేస్తే ప్రమాదకర పరిస్థితి తలెత్తే అవకాశముందని నిపుణులు స్పష్టంగా తెలిపారు. అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ గేట్లను ఎత్తకూడదని నిర్ణయించారు. అయితే 4వ గేటును మాత్రం తాత్కాలికంగా ఒక అడుగు మేర మాత్రమే ఎత్తవచ్చని, ఆ తర్వాత అది కూడా సరిగా పనిచేయలేకపోతుందని అధికారులు చెబుతున్నారు.
మరింత వరద పెరిగే అవకాశం ఉంది
ప్రస్తుతం జలాశయానికి ఎగువున కురుస్తున్న వర్షాల మూలంగా23 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో మూడు గేట్లను మాత్రమే పైకెత్తి 9 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మిగిలిన వరదను కాలువలకు వదులుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏ క్షణంలోనైనా డ్యాంకు మరింత వరద పెరిగే అవకాశం ఉంది. నిరుడు లక్ష క్యూసెక్కుల వరద వచ్చిన సమయంలో 19వ గేటు కొట్టుకుపోయింది. ఇప్పుడూ అదే స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉండడం, గేట్లు దెబ్బతినడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వరద నీటిని ఎప్పటికప్పుడు బయటకు పంపితే ప్రమాద తీవ్రత అంతగా ఉండకపోవచ్చని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు.
తుంగభద్ర ఏ నదుల కలయికతో ఏర్పడింది?
కర్ణాటకలో తుంగ, భద్ర అనే రెండు నదులు కలసి తుంగభద్ర నదిగా ఏర్పడతాయి.
తుంగభద్ర నది పొడవు ఎంత?
తుంగభద్ర నది సుమారు 531 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: