📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tumburutheertham : పాపవినాశనం తరహాలో తుంబురుతీర్థం పుణ్యస్నానాలకు త్వరలో అనుమతి

Author Icon By Shravan
Updated: August 5, 2025 • 12:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల : శేషాచలం కొండల్లో వెలసిన కలియుగ వైకుంఠం తిరుమల పవిత్రపుణ్యక్షేత్రంలో మూడున్నరకోట్ల పుణ్య తీర్థాల్లో తుంబురుతీర్థం (Tumburutheertham) పుణ్యస్నానాలకు సాధారణ రోజుల్లోనూ భక్తులను అనుమతించే విషయంపై చర్చ మొదలైంది. ఈ పుణ్యతీర్థం తిరుమల రిజర్వుఫారెస్ట్ పరిధిలో ఉండటంతో సాధారణ రోజుల్లో భక్తులను అనుమతించడం లేదు. సప్తగిరులపై ప్రకృతి సిద్ధంగా వెలసిన తీర్థాలలో ఏడుతీర్థాలు అత్యంత పవిత్రమైనవిగా ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య ముక్తి ప్రదాయాన్ని కలిగిస్తాయని ప్రగాఢ విశ్వాసం. శ్రీవారి పుష్కరిణి, రామకృష్ణ తీర్థం, ఆకాశగంగ, పాపవినాశనం, కుమారధార, తుంబురుతీర్థం, పాండవతీర్థం ఈ పుణ్యతీర్థాల్లో ఏడాదికోసారి మాత్రమే కొన్ని పుణ్యఘడియలు ప్రవేశిస్తాయి. ఈ సమయాల్లో ఆయా తీర్థాల్లో ముక్కోటి ఉత్సవాలు నిర్వహించి భక్తులు స్నానాలా చరించేలా టిటిడి అధికారులు ఏర్పాట్లు చేస్తారు. తుంబురుతీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగి ముక్తికలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇదే నమ్మకంతో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ అటవీశాఖ అధికారులతో కలసి ఆదివారం తుంబురుతీర్థం పర్యటించారు. తీర్థంలో ఉన్న సదుపాయాలు, సాధారణ రోజుల్లోనూ భక్తులను అనుమతించి పుణ్యస్నానాలాచరించేలా చూస్తే ఎలా ఉంటుందనే కోణంలో తీశారు. తుంబురుతీర్థ ముక్కోటి మార్చి, ఏప్రిల్ నెలల్లో పాల్గుణ పౌర్ణమి, చైత్ర పౌర్ణమి రోజుల్లోమాత్రమే అనుమతించడం వల్ల చాలామంది భక్తులు (Devotees) తుంబుతీర్థంను సందర్శించలేకపోతున్నారని తెలుసుకున్నారు. ఆ రెండుప్రత్యేక రోజుల్లో సుమారుగా 25వేల మంది వరకు భక్తులు ఈ తీర్థంలో పవిత్ర స్నానాలాచరిస్తారు. రిజర్వు ఫారెస్ట్లో ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టిటిడి పెద్దఎత్తున ఏర్పాట్లుచేస్తుంది. అన్న ప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, వైద్య శిబిరాలు వంటివి సౌకర్యాలు కల్పిస్తారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/judiciary-justice-tuhin-kumar-takes-oath-as-additional-judge-of-high-court/andhra-pradesh/526151/

Hindu Pilgrimage India Spiritual Tourism Tumburutheertham

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.