📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: TTD: దేవుని సొమ్ముకు ఎవరైనా బాధ్యులే

Author Icon By Rajitha
Updated: October 27, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD: టిటిడిలో శాశ్వత ఉద్యోగులు అయినా డిప్యూటేషన్ పై ఇతర శాఖల నుండి వచ్చినా ప్రతి ఒక్కరూ దేవుని పవిత్రతను, ఆస్తులను కాపాడటంలో తమవంతు బాధ్యత ఉంటుందనేది గుర్తుంచుకోవాలని టిటిడి (TTD) వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరీ అలాంటిది చోరీ కేసును సమగ్రంగా విచారణ చేయించాల్సింది పోయి మధ్యవర్తిత్వం జరిపి రాజీచేయడంలో గతంలో కొనసాగిన బోర్డు, ఉన్నతాధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఏకంగా ఎవిఎస్ సతీష్ కుమార్ వ్యవహారం ఎక్కడకు దారితీస్తుందనేది మాత్రం, రాజీ చేసుకోవాలని సూచనలు చేసిన ఆ పై అధికారులు మాత్రం దోషులుగా నిలబడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. హైకోర్టు న్యాయమూర్తి ఇటీవల ఆదేశాలతో టిటిడి ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ కౌంటర్ దాఖలుకు మరికొంత సమయం కావాలని విజ్ఞప్తిచేశారు. ఇదే సమయంలో పూర్వ ఎవిఎసి, హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడం వెనుక ఉన్న పెద్దలు ఎవరనేది మాత్రం మంగళవారం తిరుమలలో జరిగే బోర్డు సమావేశంలో వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Read also: Markapuram : త్వరలోనే జిల్లా కేంద్రంగా మార్కాపురం !

TTD: దేవుని సొమ్ముకు ఎవరైనా బాధ్యులే

ఇదే సమయంలో సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామి శ్రీనివాసానంద సరస్వతి అప్పటి ఎవిఎస్ వ్యవహార శైలిపై, లోక్అదాలత్వరకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేయాలని విజప్తి చేస్తూ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలుచేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. మరీ ఈ కేసులో నేడు హైకోర్టు (High court) న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం వెలువడించనున్నారనేది అటు టిటిడి వర్గాల్లో ఇటు గత టిటిడి పెద్దల్లో మరింత ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఇదే అంశంపై బోర్డు సభ్యుడు భానుప్రకాశొడ్డి కూడా ఆవేదన పూర్వకమైన విషయం వెల్లడించారు. దేవుని సొమ్మును కాపాడటంలో కాపలాకుక్కలా ఉంటున్నానని, ఈ కేసును ఉపసంహరించుకోవాలని నిందితుడు తరపున తనకు హెచ్చరికలు చేశారనేది ఆయన తెలిపారు. మరీ దేవుని సొమ్ముచోరీచేసిన కేసులో న్యాయం జరగాలనేది తన అభిప్రాయంగా వెల్లడించారు. తాను, తన కుటుంబం ఎవరిపై వ్యక్తిగత కక్ష, ద్వేషంలేదని స్పష్టం చేశారు.

టిటిడిలో ఎవరు దేవుని ఆస్తుల రక్షణకు బాధ్యులు?
టిటిడిలో శాశ్వత ఉద్యోగులు కావచ్చు, లేదా ఇతర శాఖల నుండి డిప్యూటేషన్‌పై వచ్చినవారు కావచ్చు — ప్రతి ఒక్కరూ దేవుని ఆస్తులను, పవిత్రతను కాపాడటానికి బాధ్యత వహించాలి.

ఎవిఎస్ సతీష్ కుమార్ వ్యవహారం ఎందుకు చర్చనీయాంశమైంది?
చోరీ కేసును విచారణ చేయకుండా రాజీ చేసుకోవాలని సూచించిన పై అధికారుల పాత్ర కారణంగా ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh latest news Telugu news : Sandeep Reddy Vanga - ప్రభాస్ని చూసిభయపడ్డా (video) temple funds tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.