TTD : ఏడుకొండల శ్రీవేంకటేశ్వర స్వామిని సంతృప్తికరంగా దర్శించుకుంటున్న భక్తుల సంఖ్యకుట్టింపుగా, స్వామివారికి కానుకలు రూపంలో హుంఢీ ఆదాయం అంతకంతకూ రికార్డుసృష్టిస్తోంది. జులైనెలలో హుంఢీ కానుకలు 129 కోట్లు రూపాయలు, ఈ ఆగస్టునెలలో 123.43కోట్లు రూపాయలు ఆదాయం (Income) లభించింది,. నెలనెలకో ప్రత్యేకత సంతరించుకుంటోంది. ఆగస్టునెలలో 31రోజుల హుం ఢీ ఆదాయమే 123కోట్లరూపాయలు చేరుకోవడం రికార్డు. ఆగస్టు నెలకు సంబంధించి హుంఢీ ఆదాయం గణాంకాలు పరిశీలిస్తే 19వతేదీ హుండీ ఆదాయం 5.30కోట్లు రూపాయలు, 18న హుంఢీ ద్వారా 4.88కోట్లు రూపాయలు, 17న 4.46కోట్లు , 25 4.285, 35 4.25, 45 4.215, 22, 4.75కోట్లు ఇలా వరుసగా మిగిలిన రోజుల్లో 3.50కోట్ల రూపాయలు ఆదాయం దాటింది. నెలవారీగా ఏడుకొండలకు చేరుకుంటున్న భక్తుల సంఖ్య సరాసరి 23లక్షలమంది వరకు ఉంటుండగా, G భక్తులు సమర్పించుకుంటున్న మొక్కుల ద్వారా వడ్డీకాసులవాడి ఖజానాకు కాసుల వరద వెల్లువెత్తుతోంది.
ఆగస్టు నెలలో తిరుమల హుండీ ఆదాయం ఎంత వచ్చింది?
ఆగస్టు నెలలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ద్వారా రూ.123.43 కోట్ల ఆదాయం లభించింది. నెలలో ప్రతి రోజూ సగటున రూ.3.5 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
జూలై మరియు ఆగస్టు నెలల హుండీ ఆదాయాల్లో తేడా ఏమిటి?
జూలైలో రూ.129 కోట్ల హుండీ ఆదాయం రాగా, ఆగస్టులో రూ.123.43 కోట్ల ఆదాయం వచ్చింది. నెలవారీ ఆదాయాలు నిరంతరం ₹100 కోట్లకు పైగానే ఉండి రికార్డులు సృష్టిస్తున్నాయి.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :