📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TTD: తిరుమలలో తనిఖీలు నిర్వహించిన వెంకయ్య చౌదరి – భక్తుల సౌకర్యాలపై సమీక్ష

Author Icon By Sharanya
Updated: June 1, 2025 • 11:44 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి వచ్చేసిన భక్తులతో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల వేసవి సెలవులు, వారాంతాల రద్దీ వల్ల వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం టీటీడీ అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల సమర్థ సేవల కోసం అదనపు కార్యనిర్వహణాధికారి (Additional EO) సీహెచ్ వెంకయ్య చౌదరి శనివారం తిరుమలలో స్వయంగా తనిఖీలు నిర్వహించి, భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.

భక్తుల రద్దీ – విశేష సంఖ్యలో దర్శనాలు

శుక్రవారం నాడు 71,721 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 36,011 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.42 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుండి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

వివిధ విభాగాల సమన్వయంతో సేవలు

వేసవి సెలవుల కారణంగా రద్దీ పెరగడంతో, తిరుమలలోని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, క్యూలైన్ల నిర్వహణ, వైద్యం, భద్రత, బోధన సిబ్బంది, అన్నప్రసాదం పంపిణీ వంటి విభాగాలు 24 గంటలూ కృషి చేస్తున్నారు. సుదీర్ఘ సమయం వేచి చూస్తున్న భక్తుల సహనం కోసం, టీటీడీ వివిధ మాద్యమాల్లో సందేశాలు కూడా అందిస్తోంది.

వెంకయ్య చౌదరి తనిఖీలు – భక్తుల అభిప్రాయాలపై స్పందన

అదనపు ఈఓ వెంకయ్య చౌదరి స్వయంగా తనిఖీలు నిర్వహించారు. తిరుమలలో శిలాతోరణం వద్ద క్యూలైన్లు, , భ‌క్తుల‌కు పంపిణీ చేస్తున్న అన్న‌ ప్రసాదాలు, ఇతర సౌకర్యాల గురించి అభిప్రాయాలను తెలుసుకున్నారు. టీటీడీ సిబ్బంది అందిస్తోన్న సౌక‌ర్యాల‌పై భక్తులు సంతృప్తి వ్య‌క్తం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. క్యూలైన్ లల్లో భక్తులకు అన్న ప్ర‌సాదాలు అంద‌ట్లేదని నినాదాలు చేశాడని, ఆ విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని అన్నారు. ఆయ‌నను వెంట‌నే సంప్ర‌దించి ఆరా తీయ‌గా త‌న‌కు ఆరోగ్యం స‌రిగ్గా లేక‌పోవ‌డం, ర‌ద్దీ గురించి అవ‌గాహ‌న లేక‌పోవ‌డం, ద‌ర్శ‌న స‌మ‌యం ఆల‌స్య‌మౌతోందనే కారణంతో తాను అసహనానికి గురైనట్లు ఒప్పుకున్నారని చెప్పారు. ఆ తరువాత క్షమాపణలు చెప్పాడని అన్నారు.

అనధికారిక వీడియోలు – చట్టపరమైన హెచ్చరిక

కొంతమంది అనధికారిక వ్యక్తులు క్యూలైన్లలో ఉండి భక్తుల నుంచి వ్యాఖ్యలు రాబట్టి, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్న విషయాలు టీటీడీ దృష్టికి వచ్చాయి. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వెంకయ్య చౌదరి హెచ్చరించారు. తిరుమల వంటి పవిత్ర స్థలాన్ని అసత్య ప్రచారాలకు వేదికగా మలచడం సరికాదని అన్నారు.

సర్వదర్శనం భక్తులకు పెద్దపీట – VIP దర్శనాల పరిమితి

వెంకయ్య చౌదరి పేర్కొన్నదాని ప్రకారం,వేస‌వి సెల‌వుల నేప‌థ్యంలో ప్ర‌తి రోజూ ల‌క్ష‌కు పైగా భ‌క్తులు స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్నార‌ని, వారాంతాల్లో ఈ సంఖ్య 1.20 ల‌క్ష‌లు దాటుతోంద‌ని చెప్పారు. వీఐపీ బ్రేక్‌, శ్రీ‌వాణి ద‌ర్శ‌నాల‌ను త‌గ్గించి సాధార‌ణ భ‌క్తుల‌కే ద‌ర్శ‌నాల్లో పెద్ద‌పీట వేస్తున్నామ‌ని అదనపు ఈఓ వివరించారు. ప్ర‌తిరోజూ 60 శాతానికి పైగా స‌ర్వ ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తులే స్వామివారిని ద‌ర్శించుకుంటున్నార‌ని పేర్కొన్నారు. సాధార‌ణ రోజుల‌ కంటే 10,000 మంది భ‌క్తుల‌కు అద‌నంగా ద‌ర్శ‌న‌ం కల్పించడానికి టీటీడీ సిబ్బంది క‌ష్ట‌ప‌డుతున్నార‌ని అన్నారు. క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు శ్రీ‌వారి సేవ‌కుల ద్వారా నిరంత‌రాయంగా అన్న ప్ర‌సాదాలు, టీ, కాఫీ, పాలు, మ‌జ్జిగ‌, స్నాక్స్ పంపిణీ చేస్తున్నామ‌ని, ఆరోగ్య విభాగం ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు చెత్త‌ను తొల‌గిస్తూ భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం త‌లెత్త‌కుండా పారిశుద్ధ్యంపై ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌ని తెలిపారు.

విప‌రీత ర‌ద్దీ నేప‌థ్యంలో భ‌క్తులు టీటీడీ అందిస్తున్న సౌక‌ర్యాల‌ను వినియోగించుకుని సంయ‌మ‌నం పాటిస్తూ స్వామివారిని ద‌ర్శించుకోవాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం తిరుమ‌ల‌కు విచ్చేసే భ‌క్తుల కోసం టీటీడీ సిబ్బంది అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నా భ‌

Read also: Andhrapradesh: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ పంపిణీలో కీలక మార్పులు

#Tirumala #TirumalaDarshan #TTDInspections #TTDUpdates #VenkayyaChowdary Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.