📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: TTD: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు యధాతథం

Author Icon By Rajitha
Updated: October 29, 2025 • 12:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TTD: తిరుమల: వైఖానస ఆగమోక్తంగా పూజలు జరిగే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ ఏడాది డిసెంబర్ లో కూడా పది రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు దర్శనం కల్పించేలా టిటిడి నిర్ణయించింది. వైకుంఠద్వార దర్శనాల టోకెన్లు జారీ విధానం అత్యంత పారదర్శకంగా నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో 30కోట్లరూపాయలతో టిటిడి ఆలయాన్ని నిర్మించేందుకు నిర్ణయించారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనం లో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఉదయం 10గంటలకు మొదలైన సమావేశం సాయంత్రం 6గంటల వరకు సుదీర్ఘంగా కొనసాగింది. ధర్మకర్తల మండలి ఛైర్మన్ బిఆర్నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాలను టిటిడి ఇఒ అనిల్కుమార్సింఘాల్, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్యచౌదరి, బోర్డు సభ్యులు భానుప్రకాశొడ్డి, పనబాకలక్ష్మి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంఎస్రారాజు, శాంతారామ్, నర్మిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, జానకీదేవితో కలసి మీడియాకు వెల్లడించారు.

Read ALSO:  Montha Cyclone: మొంథా తుపాను వల్ల 40 లక్షల మంది ప్రభావితం

TTD: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు యధాతథం

TTD: తిరుమల ఆలయంలో అత్యంత పవిత్రమైన వైకుంఠద్వార దర్శనాలకు సంబంధించి పదిరోజులా, రెండురోజులా అనే అనుమానాలకు చెక్పెడుతూ సామాన్యభక్తుల అభిప్రాయాలకు అనుగుణంగా పదిరోజులపాటు వైకుంఠ దర్శనాలకు మొగ్గుచూపారు. డిసెంబర్ 30వతేదీ వైకుంఠ ఏకాదశి ఘడియలు మొదలవుతాయి. 31వతేదీ ద్వాదశితో బాటు 2026 నూతన సంవత్సరం జనవరి 8వతేదీ వరకు వైకుంఠద్వారాలు తెరచి ఉంచుతారు. పదిరోజులపాటు పవిత్రమైన వైకుంఠ ద్వారాలను తెరచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలమేరకు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఐదువేల ఆలయాల నిర్మాణాలకు ఆమోదం తెలిపారు.

దేశంలోని అన్ని టిటిడి ఆలయాల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభిస్తారు. కడపజిల్లా ఒంటిమిట్టలో 37కోట్ల రూపాయలతో వసతి సముదాయం నిర్మాణానికి ఆమోదం. మరో 3కోట్ల రూపాయలతో ఒంటిమిట్టపవిత్ర వనం నిర్మాణానికి ఆమోదించారు. టిటిడి గోశాల నిర్వహణను గోసంరక్షకులకు అప్పగించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు. చిత్తూరుజిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి కొలువైన చోట 25 కోట్ల రూపాయలతో టిటిడి అతిధిగృహం, కల్యాణ మండపాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. సాధ్యమైనంతమంది ఎక్కువమంది భక్తులకు పవిత్రమైన వైకుంఠద్వార దర్శనాలు చేయించేందుకు ఇదివరకు లాగే పదిరోజులు వైకుంఠద్వార దర్శనాలకే ఆమోదం తెలిపారు. టిటిడి ప్రొక్యూర్మెంట్ సెల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించడంతో ఏసిబితో విచారణ చేయించాలని బోర్డు నిర్ణయించింది.

గత ప్రభుత్వ హయాంలో టిటిడి కొనుగోలుచేసిన అన్ని వస్తువుల్లోనూ భారీగా అవినీతి అక్రమాలు జరిగాయనేది బోర్డు నిర్ధారించింది. ఆ అక్రమాలపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారికి కఠినంగా శిక్షించేలాచూస్తామన్నారు. టిటిడి వైద్య విభాగంలో అన్ని ఆస్పత్రులను మరింతగా పారదర్శకంగా నిర్వహిచేందుకు ఒకే డైరెక్టరిందకు తీసుకురానున్నామన్నారు. ప్రస్తుతం బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జగదీశ్ను అన్ని ఆస్పత్రుల డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వ అనుమతికి సిఫార్సు చేశారు. అం తకుముందు నవంబర్ 17 నుండి 25వరకు జరిగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను ఆవిష్కరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Devotees latest news Telugu News tirumala TTD VaikunthaDwaram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.