📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News: TTD: కమనీయంగా ఉద్దాల మహోత్సవం

Author Icon By Sushmitha
Updated: October 29, 2025 • 10:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్సవానికి పోటెత్తిన భక్త జనం

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలం, అమ్మాపూర్ కొండల్లో స్వయంభూగా వెలసి ‘పేదల తిరుపతి’గా పేరు గాంచిన కురుమూర్తి స్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

Read Also: TG: మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

ఉద్దాల మండపం, తొలి పూజ

వడ్డెమాన్‌లోని ఉద్దాల కర్మాగారంలో దళితులు నియమనిష్ఠలతో కురుమూర్తి స్వామి, పద్మావతి అమ్మవార్ల పాదుకలను తయారు చేశారు. పల్లమర్రిలోని మేదరులు తయారు చేసిన చాట ఉద్దాల మండపానికి చేరగా, స్వామివారి పాదుకలను ఆ చాటలో ఉంచి మండపం ముందు ఉంచారు. అక్కడ నెల్లి వంశీయులు తొలి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర చైర్‌పర్సన్ సీత దయాకర్ రెడ్డి,(State Chairperson Seetha Dayakar Reddy) రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలితమ్మ, దేవస్థానం చైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పాదుకల ఊరేగింపు, భక్తుల కోలాహలం

అనంతరం స్వామివారి పాదుకలు ఉన్న చాటను తలపై ఉంచుకునేందుకు భక్తులు ఒకరినొకరు పోటీ పడ్డారు. స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి పాదుకలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, వాటిని అందంగా అలంకరించిన ట్రాక్టర్‌పై ఉంచి, ఉద్దాల గుండుకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అక్కడ వేలాదిగా తరలివచ్చిన భక్తజనం శివసత్తుల నృత్యాలు, భక్తుల గోవింద నామస్మరణతో కురుమూర్తి గిరులు పులకించాయి. కొండ దిగువన జాతర మైదానంలో స్వామివారి పాదుకలు ఉంచిన ట్రాక్టర్‌తో మూడు ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం పాదుకలను కొండపై గల స్వామివారి ఆలయానికి చేర్చి, ఉద్దాల మండపంలో ఉంచి భక్తులకు దర్శనం కల్పించారు.

కురుమూర్తి స్వామి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం ఏమిటి?

ఉద్దాల మహోత్సవం.

కురుమూర్తి స్వామి దేవాలయం ఎక్కడ ఉంది?

మహబూబ్‌నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండలం, అమ్మాపూర్ కొండల్లో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu Govinda Namasmarana. Kurumurthi Swamy Latest News in Telugu mahabubnagar Telugu News Today Temple Festival Udal Mahotsavam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.