📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

News Telugu: TTD: సామాన్య భక్తులకు టీటీడీ తీపికబురు..

Author Icon By Rajitha
Updated: December 5, 2025 • 3:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ (TTD) చేసిన ఏర్పాట్లను ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భక్తులకు వివరించారు. ఈ సంవత్సరం సాధారణ భక్తులు ఎక్కువగా దర్శనం పొందేలా సమయాన్ని కేటాయించామని తెలిపారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో దాదాపు 164 గంటలు సామాన్య భక్తులకు మాత్రమే ఉండేలా నిర్ణయం తీసుకోవడం ద్వారా టీటీడీ భక్తులపై చూపుతున్న శ్రద్ధను వెల్లడించారు. శ్రీవారీ దర్శనం కోసం తీసుకున్న ఈ నిర్ణయాలు భక్తుల్లో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.

Read also: Scrub typhus: జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటు

డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు జరిగే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల కోసం సుమారు 7.70 లక్షల మంది భక్తుల రాకను అంచనా వేసి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో తెలిపారు. మొదటి మూడు రోజుల కోసం సర్వదర్శనం టోకెన్లు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించగా, శ్రీవాణి మరియు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేశారు. మిగిలిన రోజులకు శ్రీవాణి టికెట్లు ఉదయం 10 గంటలకు, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. జనవరి 2 నుంచి 8 వరకు భక్తులకు VQC–2 ద్వారా సర్వదర్శనం అవకాశం ఉంటుంది. ప్రోటోకాల్ ప్రముఖులు స్వయంగా వచ్చినప్పుడు మాత్రమే ప్రత్యేకంగా దర్శనం ఏర్పాటు చేస్తామని, స్థానికులకు జనవరి 6 నుంచి 8 వరకు దర్శన బుకింగ్‌ను డిసెంబర్ 10న అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

latest news Telugu News tirumala TTD Updates vaikunta ekadasi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.