📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ ఉత్సవాలు పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం

News Telugu: TTD Tokens: పాతపద్ధతిలోనే అంగప్రదక్షిణ టోకెన్లు

Author Icon By Rajitha
Updated: October 6, 2025 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విడుదల దిశగా టిటిడి పునరాలోచన తిరుమల Tirumala : వందల సంఖ్యలో భక్తుల నుండి వచ్చిన విజుప్తుల మేరకు తిరుమలతిరుపతి దేవస్థానం అధికారులు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల విషయంపై మళ్ళీ పునరాలోచనలో పడింది. ఇప్పటికే అంగప్రదక్షిణ టోకెన్లు జారీని ఆన్లైన్లో తిరుమలలోని కౌంటర్లకు స్వస్తిపలికి పూర్తిగా ఆన్లైన్ చేసిన విషయం విదితమే. ఆన్లైన్లో రోజువారీగా 750 అంగప్రదక్షిణ టోకెన్లు ఉచితంగా భక్తులకు మూడునెలల ముందుగానే విడుదల చేస్తోంది. ఒక్క శుక్రవారం రోజు మినహాయించి వారంలో అన్ని రోజులు వేకువజామున 1.30గంటలకు అంగప్రదక్షిణ భక్తులకు అవకాశం కల్పించారు. అయితే ఇటీవల కొందరు టిటిడి TTD అధికారులు తీసుకున్న నిర్ణయంతో అంగప్రదక్షిణ టోకెన్లు కూడా ఆన్లైన్ ముందువచ్చిన వారికి ముందు అన్నట్లుగాక లక్కీడిప్ విధానం అమలులోకి తీసుకువచ్చారు.

Srisailam Dam:వరద తగ్గుముఖం, 13 గేట్లు ఎత్తి నీటివిడుదల

TTD Tokens

ఈ విధానం వల్ల టోకెన్లు మూడునెలల ముందుగానే ఆన్లైన్లో లక్కీడిప్ విధానం ద్వారా గతనెల 18వతేదీ నుండి విడు దలవుతున్నాయి. భక్తులు తిరిగి ఈ సేవ పోందేందుకు 90రోజులు గడువు ఉండేది. కొత్తవిధానంతో 180రోజులకు పొడిగించారు. అయితే ఈ విధానం వల్ల సామాన్యభక్తులు చాలావరకు ఇబ్బందులు పడుతున్నారని, టోకెన్లు అందుకో లేకపోతున్నామనే అసంతృప్తిని ఫిర్యాదుల రూపంలో టిటిడి డయల్ యువర్ ఇఒకు తెలియజేశారు. లక్కీడిప్ ద్వారా అంగప్రదక్షిణ టోకెన్లు కేటాయింపు విధానాన్ని పునఃపరీశీలిం చాలని భక్తులు కోరారు. పాతపద్ధతిని అమలు చేయాలని విజ్ఞప్తిచేశారు. అందిన సూచనలు, అభ్యర్థనలను పరిగణనలోనికి తీసుకుని పాతవిధానంలోనే తిరిగి అంగప్రదక్షిణ టోకెన్లు జారీచేస్తామని హామీ ఇచ్చారు.

300 టోకెన్లు

భక్తుల నుండి అందుతున్న సూచనలు, అభిప్రాయాల ఆధారంగానే వారికి సౌకర్యవంతంగా నిర్ణయాలు తీసుకుంటామని ఇఒ స్పష్టం చేయడంతో అం గప్రదక్షిణ టోకెన్లు జారీని ఈనెలలో పాతవి ధానంలోనే కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా గతంలో ఒక్కశనివారం రోజుకు మాత్రం స్థానిక భక్తులకు 300 టోకెన్లు ఆఫ్లైన్లో జారీచేసే విధానంపై కూడా ఇఒ పున:సమీక్షించే అవకాశం లేకపోలేదు. ఆపద మొక్కుల వాడు తిరుమల ఏడుకొండలస్వామికి ఎంతో భక్తితో భక్తులు చెల్లించుకునే మొక్కుల్లో వేకువజామున చేపట్టే అంగప్రదక్షిణ కూడా ఎంతో పవిత్రమైంది. కాగా రానున్న 2026 జనవరినెలకు సంబంధించి అంగప్రదక్షిణ టోకెన్లకోసం పాత విధానంలోనే విడుదల చేయ నున్నారనేది స్పష్టమైంది. శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజులు 750 టోకెన్లు, శనివారం మాత్రం ఆన్లైన్లో 500 టోకెన్లు జారీచేయడం జరుగుతోంది.

తిరుమలలో అంగప్రదక్షిణ టోకెన్లపై టిటిడి ఏ నిర్ణయం తీసుకుంది?
భక్తుల విజ్ఞప్తుల మేరకు టిటిడి అధికారులు అంగప్రదక్షిణ టోకెన్లను పాత విధానంలోనే విడుదల చేయాలని పునరాలోచనలో ఉన్నారు.

ప్రస్తుతం టిటిడి ఎలాంటి విధానంలో టోకెన్లు జారీ చేస్తోంది?
ప్రస్తుతం ఆన్లైన్లో లక్కీడిప్ విధానంలో రోజుకు 750 అంగప్రదక్షిణ టోకెన్లు ఉచితంగా భక్తులకు మూడునెలల ముందుగానే విడుదల చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh Angapradakshina Breaking News Devotee Services latest news Lucky Dip Online Booking Telugu News Temple Tokens tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.