📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

News Telugu: TTD: పరకామణి లెక్కింపుల్లో, ఎఐ వినియోగంపై హైకోర్టు కీలక సూచనలు

Author Icon By Rajitha
Updated: December 17, 2025 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి


తిరుమల : తిరుమల కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామికి భక్తులు మొక్కుబడులుగా హుండీకి సమర్పించే కానుకల లెక్కింపు పరకామణిలో పాతపద్ధతులు అనుసరించడం సరికాదని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారీగా చోరీలు జరుగుతున్నప్పటికీ పాత “పద్దతులకు మానవ ప్రమేయాన్ని తగ్గించి, పూర్తిగా స్వస్తిచెప్పి యంత్రాలు, మానవకృత్రిమ మేధ (ఎఐ) (AI) వంటి నూతన సాంకేతికతను వినియోగించాలని టిటిడికి సూచించింది. తిరుమల పరకామణి భవనంలో చోరీ కేసు మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల చోటుచేసుకున్న అనేక పరిణామాల నేపధ్యంలో చోరీ కేసును తీవ్రంగా పరిగణించి కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల ఆలయంలో శ్రీవారి హుండీ కానుకల లెక్కించే పరకామణి భవనంలో చోటుచేసుకునే దొంగతనాలను సాధారణ దొంగతనాలుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఇది కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు ముడిపడిన సున్నితమైన విషయంగా అభిప్రాయం వెలువడించింది.

Read also: Sreecharani: శ్రీచరణికి 2.5 కోట్ల చెక్కును అందచేసిన మంత్రి లోకేష్

The High Court has given crucial suggestions regarding the use of AI

ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించవద్దని

పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను వెంటనే ఆధునీకరించాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. మానవ ప్రమేయాన్ని తగ్గించి కృత్రిమ మేధస్సును వినియోగించాలని స్పష్టం చేసింది. కానుకల లెక్కింపుకు సేవాభావంతో పాల్గొనే భక్తులను దుస్తులు లేకుండా తనిఖీ చేయడం సరికాదని సూచించింది, వారిని అవమానించడం మంచిదికాదని పేర్కొంది. అంతేగాక ఎంతో అమూల్యమైన పరకామణి లెక్కింపు ప్రక్రియలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వినియోగించవద్దని ధర్మాసనం తన సూచనలు, సలహాలతో హైకోర్టు ముందుకు రావాలని నిందితుడు తరపున న్యాయ వాదులను, టిటిడి తరపున న్యాయవాదులను ఆదేశించింది. తదుపరి 18వతేదీకి విచారణ వాయిదా వేసింది. ఇప్పటికే తిరుమల పరకామణిలో 920 అమెరికన్ డాలర్లు చోరీకేసు తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, నిందితుడు నుండి గిఫ్టీడ్లుగా ఆస్తులు రాయించుకోవడం, లోక్అదాలత్లో మద్య వర్తిత్వంతో రాజీచేయడం వంటివి హైకోర్టు దృష్టి లో ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసును తీవ్రమైన నేరంగా పరిగణించడంతో ఎలాంటి చర్యలు ఉంటాయనేది ఆందోళనకలిగించే అంశం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

High court latest news Parakamani Telugu News tirumala TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.