తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి ప్రస్తుతం 8 నుంచి 10 గంటల వరకు సమయం పడుతున్నట్లు టీటీడీ (Tirumala) అధికారులు వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారందరికీ క్రమబద్ధంగా దర్శనం కల్పించే ఏర్పాట్లు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
Read also: Skill Development Case : స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్
darshan of Lord Venkateswara will take 8–10 hours
సోమవారం ఒక్క రోజే 68,542 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ వెల్లడించింది. ఇందులో భాగంగా 22,372 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు పేర్కొంది. అలాగే హుండీ ద్వారా రూ.3.98 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదాలు, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశారు.
భక్తులు ముందస్తుగా దర్శన టోకెన్లు పొందితే వేచి ఉండే సమయం తగ్గుతుందని, అధికారుల సూచనలను పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: